6 Journey Movie: గ్రాండ్‌గా '6జర్నీ' మూవీ టీచర్ లాంచ్.. అదిరిపోయిన విజువల్స్, ఆర్ఆర్

6 Journey Movie Teaser: 6 జర్నీ మూవీ టీజర్‌ ఈవెంట్‌గా గ్రాండ్‌గా నిర్వహించారు. టీజర్‌లో విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయని పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సినిమా హిట్ అవుతుందని నమ్మకం ఉందన్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుందన్నారు.  

Written by - Ashok Krindinti | Last Updated : Sep 6, 2024, 06:23 PM IST
6 Journey Movie: గ్రాండ్‌గా '6జర్నీ' మూవీ టీచర్ లాంచ్.. అదిరిపోయిన విజువల్స్, ఆర్ఆర్

6 Journey Movie Teaser: రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి కీలక పాత్రల్లో బసీర్ అల్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ 6జర్నీ.  అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై పాల్య రవి ప్రకాష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైన ఈ మూవీని త్వరలోనే ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను పటేల్ రమేష్ రెడ్డి రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమాను తెర‌కెక్కించిన విధానం బాగుందని మెచ్చుకున్నారు. విజువల్స్, ఆర్ఆర్ అదిరిపోయాయని.. సినిమా మంచి హిట్ అవుతుందన్నారు. డైరెక్టర్ దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారని.. హీరోయిన్లు అద్భుతంగా నటించారని చెప్పారు. టేస్టి తేజ ఎనర్జీ యాక్ట్ చేశారన్నారు. సురేందర్ రెడ్డి తమకు టీచర్ అని.. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు.  

Also Read: Thali Price: శాఖాహారం భోజనం  రేటు కంటే..మాంసాహారం భోజనం రేటు తక్కువ..సీన్‌ రివర్స్‌ అయిందేందబ్బా?

అనంతరం ప్రొడ్యూసర్ రవి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాను నిర్మిస్తూ.. ఇందులో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. సినిమా అద్భుతంగా వచ్చిందని.. బసీర్‌ సినిమాను చాలా బాగా డైరెక్ట్ చేశారి అన్నారు. టీజర్ అందరికీ నచ్చేలా ఉందని.. తప్పకుండా హిట్ అవుతుందన్నారు. మిగిలిన నటీనటులు మాట్లాడుతూ.. తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పారు. సినిమా చాలా బాగా వచ్చిందని.. డైరెక్టర్ బషీర్ అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. 

టేస్టీ తేజ మాట్లాడుతూ.. తనకు బిగ్‌ బాస్ షోకు వెళ్లకముందే ఈ ఆఫర్ వచ్చిందన్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా మళ్లీ షూటింగ్‌‌లో పాల్గొన్నానని.. తనకు ఈ టీం ఎంతో సహకరించిందన్నాడు. బషీర్ ఆలూరి దర్శకత్వం లో నటించడం చాలా సంతోషంగా అనిపించిందన్నాడు. 

సాంకేతిక వర్గం:

==> సమర్పణ- పాళ్యం శేషమ్మ, బసిరెడ్డి. 
==> బ్యానర్ - అరుణ కుమారి ఫిలింస్ 
==> ప్రొడ్యూసర్- పాళ్యం రవి ప్రకాష్ రెడ్డి
==> కథ, మాటలు, దర్శకత్వం- బసీర్ అలూరి
==> సినిమాటోగ్రపీ- టి.సురేందర్ రెడ్డి 
==> ఎడిటింగ్ - ఎన్.శ్రీనుబాబు 
==> సంగీతం -ఎం.ఎన్.సింహ 
==> సాంగ్స్- రామారావు మాతుమూరు
==> డ్యాన్స్ -కళాధర్, రాము
==> ఫైట్స్ -శ్రీను
==> కాస్టుమ్స్ - అంజిపూసల 
==> ఆర్ట్- బిగ్గు 
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్- రవి కుంచాల, ఎం.గుణ రెడ్డి 
==> కో డైరెక్టర్-అభిరామ్ 
==> ప్రొడక్షన్ మేనేజర్- కోటేష్ బుద్దిరెడ్డి.   
==> PRO- చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల
Also Read : Best Business Ideas:  మహిళలు ఈ ఒక్క చిన్న కోర్సు నేర్చుకుంటే చాలు.. సీజన్‎లో రోజు రూ. 10వేలు సంపాదించే చాన్స్   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News