Tiger Nageswara Rao: థియేటర్ లో టైగర్‌ నాగేశ్వరరావును వీక్షించిన రవితేజ ఫ్యామిలీ, వీడియో వైరల్

Ravi teja:  మాస్ మహారాజా రవితేజ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ టైగర్ నాగేశ్వరరావు. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీని రవితేజ కొడుకు మహాధన్‌, కూతురు మోక్షద హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో వీక్షించారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 20, 2023, 08:07 PM IST
Tiger Nageswara Rao: థియేటర్ లో టైగర్‌ నాగేశ్వరరావును వీక్షించిన రవితేజ ఫ్యామిలీ, వీడియో వైరల్

Tiger Nageswara Rao Movie: ఇవాళ టైగర్ నాగేశ్వరరావు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. ప్రస్తుతం దేశవ్యాప్తంగా టైగర్ మేనియా కొనసాగుతోంది. ఈ మూవీ రిలీజైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో రవితేజ కొడుకు మహాధన్‌, కూతురు మోక్షద హైదరాబాద్‌లోని ఓ థియేటర్‌లో స్నేహితులతో కలిసి సినిమా చూశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించారు.

1970 దశకంలో స్టూవర్ట్‌పురంలో పాపులర్‌ దొంగగా పేరు గాంచిన టైగర్ నాగేశ్వర్‌ రావు జీవిత కథగా ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఇందులో రవితేజ నాగేశ్వరరావు పాత్రలో నటించారు. ఇందులో రేణు దేశాయ్, అనుపమ్‌ ఖేర్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ మూవీపై వీర లెవల్లో అంచనాలను పెంచేశాయి. 

అయితే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఈ మూవీ తెలుగుతోపాటు అన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. అయితే టైగర్ నాగేశ్వరరావు థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఓటీటీలో 8 వారాలకు స్ట్రీమింగ్ చేయాలని అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని టాక్. అయితే ఈ మూవీ క్రిస్మస్‌ కానుకగా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. 

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ తిరస్కరించిన బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలు ఇవే.. ఆ రోల్‌లో బన్నీని ఊహించుకుంటే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News