"మిషన్ బీ"కి రేణుదేశాయ్ మద్దతు

   

Last Updated : Oct 29, 2017, 04:09 PM IST
"మిషన్ బీ"కి రేణుదేశాయ్ మద్దతు

మిషన్ బీ అనే ప్రాజెక్టును కొందరు యువకులు స్వచ్ఛందంగా ప్రారంభించారు. చెత్త కాగితాలు, పుస్తకాలను సేకరించి వాటిని రీసైకిల్ చేసి, కొత్త నోటు పుస్తకాలుగా మార్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇవ్వాలన్నది ఆ ప్రాజెక్టు లక్ష్యం. ఈ లక్ష్యంలో భాగంగా హైదరాబాదు నగరంలో దాదాపు 35000 కేజీల వేస్ట్ పేపర్లను సేకరించి, 1 లక్ష పుస్తకాలను తయారుచేసేలా టార్గెట్‌ను పెట్టుకున్నారు నిర్వాహకులు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తూ, సినీనటి రేణూ దేశాయ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశారు. పాత వార్తాపత్రికలను, కాగితాలను ఈ ప్రాజెక్టులో భాగంగా "మిషన్ బీ" నిర్వాహకులకు ఇవ్వాల్సిందిగా కోరారు. తన పోస్టును షేర్ చేయాల్సిందిగా తెలిపారు. ప్రస్తుతం రేణు ఓ ప్రముఖ టెలివిజన్‌లో వస్తు్న్న రియాలిటీ డ్యాన్స్ షోకి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఫేస్బుక్‌లో కూడా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే ఆమె అప్పుడప్పుడు స్వచ్ఛంద కార్యక్రమాలకు కూడా తన వంతు మద్దతును ఇస్తుంటారు. 

 

Trending News