Samantha: సమంతను భయపెట్టించిన పాత్ర.. ఎందుకు , ఏమైంది..?

Samantha Upcoming Movies: పెద్ద బ్యానర్లో ఆఫర్ వచ్చిందట. అయితే హీరోయిన్ గా కాకుండా వదిన పాత్రలో నటించాలని ఆఫర్ చేశారట. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్గా జత కట్టింది కూడా.. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావడంతో వెంటనే ఈమె నో చెప్పినట్లు సమాచారం. ముఖ్యంగా ఒకప్పుడు ఆ హీరోతో రొమాన్స్ చేసి ఇప్పుడు వదినగా నటించాలంటే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోరనే కారణంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jul 23, 2024, 09:45 AM IST
Samantha: సమంతను భయపెట్టించిన పాత్ర.. ఎందుకు , ఏమైంది..?

Samantha Favourite Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అబ్బాయిల కలల రాకుమారిగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న సమంత తన అందం , అభినయంతో తెలుగు, తమిళ్,  హిందీ సినిమాలలో నటిస్తూ ఆకట్టుకుంటుంది.. ఈమె తన కెరీర్ ను ప్రారంభించి దాదాపు 15 ఏళ్లు అవుతోంది . అయితే కెరియర్ పరంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి , విడాకులు,  ఆ తర్వాత మయోసైటిస్ వ్యాధి అన్నీ కూడా ఈమె కెరియర్ పై ప్రభావం చూపించాయి. మయోసైటిస్ వ్యాధి నుండి కోలుకోవడానికి దాదాపు ఏడాదికాలం సినిమాలకు దూరమైన సమంత, ఇటీవలే కోలుకున్న తర్వాత విజయ్ దేవరకొండ తో ఖుషీ సినిమా చేసింది.. కానీ అనుకున్నంత స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అవ్వలేదు. దీంతో మరికొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరమైంది. 

ఆ తర్వాత బాలీవుడ్లో సిటాడెల్  అనే వెబ్ సిరీస్ పూర్తి చేసింది. ఇక ఇప్పుడు నిర్మాణ సంస్థను స్థాపించి ఒక సినిమాను నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒక సినిమాలో కీలక పాత్ర చేయాల్సిందిగా సమంతకు ఆఫర్ వచ్చిందట. అయితే ఆ ఆఫర్ కు భయపడి రిజెక్ట్ చేసిందని సమాచారం. మరి సమంతను అంతలా భయపెట్టిన పాత్ర ఏమిటి? అసలు ఏమైంది అనే విషయం ఇప్పుడు చూద్దాం. 

సమంత ఇటీవలే నిర్మాతగా మారి అటు మాళీవుడ్,  బాలీవుడ్ లో సినిమాలకు ఒప్పందాలు కుదుర్చుకుంటుంది. పైగా మరొకసారి రాజ్ అండ్ డీకే లతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో మలయాళంలో మమ్ముట్టితో సినిమా చేస్తోందని వార్తలు వచ్చాయి కానీ ఈ సినిమా ఓపెనింగ్ లో.. సమంత లేకపోవడంతో ఈమె పాత్ర పై సస్పెన్స్ ఏర్పడింది. మరోవైపు ఇంకో పెద్ద బ్యానర్లో ఆఫర్ వచ్చిందట. అయితే హీరోయిన్ గా కాకుండా వదిన పాత్రలో నటించాలని ఆఫర్ చేశారట. ఆ సినిమా హీరోతో గతంలో సమంత హీరోయిన్గా జత కట్టింది కూడా.. ఇప్పుడు అదే హీరోకి వదినగా ఆఫర్ రావడంతో వెంటనే ఈమె నో చెప్పినట్లు సమాచారం. 

ముఖ్యంగా ఒకప్పుడు ఆ హీరోతో రొమాన్స్ చేసి ఇప్పుడు వదినగా.. నటించాలంటే ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోరనే కారణంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ చిత్రాలైనా చేస్తాను కాని క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు ఇప్పట్లో చేయలేనని, అవకాశాలు రాకపోతే కొంతకాలం ఖాళీగైనా ఉంటానని స్పష్టం చేసింది సమంత.  ఏది ఏమైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు సమంతను పూర్తిస్థాయిలో భయపెడుతున్నాయని చెప్పవచ్చు.

Also Read: Shamshabad Airport: ఎంతైనా డబ్బులిస్తామయ్యా ఫ్లైట్‌ ఎక్కించు.. శంషాబాద్‌లో ప్రయాణికుల గొడవ

Also Read: Windows Outage: ఒక్క సమస్యతో ప్రపంచం అతలాకుతలం.. స్తంభించిన ఎయిర్‌లైన్స్‌, బ్యాంకింగ్‌, టెలికాం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News