Bheemla Nayak heroine: ఐశ్వర్య రాజేష్ ఔట్.. Samyukta Menon ఎంట్రీ కన్ఫామ్

Samyukta Menon in Bheemla Nayak movie: నిత్యా మీనన్‌తో పాటు సెకండ్ ఫీమేల్ లీడ్‌గా అవకాశం అందుకుని వాకౌట్ చేసిన ఐశ్వర్య రాజేష్  (Aishwarya Rajesh) స్థానంలో మరో హీరోయిన్ పేరు ఖరారైంది. భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ అధికారికంగా ఈ వివరాలు వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2021, 10:27 PM IST
Bheemla Nayak heroine: ఐశ్వర్య రాజేష్ ఔట్..  Samyukta Menon ఎంట్రీ కన్ఫామ్

Samyukta Menon in Bheemla Nayak movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'లో కేరళ బ్యూటీ నిత్యామీనన్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిత్యా మీనన్‌తో పాటు సెకండ్ ఫీమేల్ లీడ్‌గా అవకాశం అందుకుని వాకౌట్ చేసిన ఐశ్వర్య రాజేష్  (Aishwarya Rajesh) స్థానంలో మరో హీరోయిన్ పేరు ఖరారైంది. భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్స్ అధికారికంగా ఈ వివరాలు వెల్లడించారు. 

ఐశ్వర్య రాజేష్ స్థానంలో కేరళ కుట్టి సంయుక్తా మీనన్‌ని ఎంపిక చేసుకున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే ఓ కేరళ కుట్టి హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో మరో కేరళ బ్యూటీ వచ్చి చేరింది. వెల్‌కమ్ టూ భీమ్లా నాయక్ అని సంయుక్తా మీనన్‌కి (Samyukta Menon) స్వాగతం పలుకుతూ మూవీ యూనిట్ ఈ డీటేల్స్ వెల్లడించింది. మళయాళంలో తెరకెక్కిన అయ్యప్పనుం కోషియుం మూవీకి తెలుగు రీమేక్‌గా తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ మూవీకి హీరోయిన్స్ ఎంపిక పరంగానూ కేరళ టచ్ మరింత పెరిగింది.

 

పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సరసన నిత్యా మీనన్ జంటగా నటిస్తుండగా రానా దగ్గుబాటి సరసన సంయుక్తా మీనన్ జంటగా కనిపించనుంది. సాగర్ కే చంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత నాగ వంశీ నిర్మిస్తున్నాడు. 

థమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన రెండు పాటలు ఇప్పటికే ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. భీమ్లా నాయక్ మూవీ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ చూడాలంటే వచ్చే ఏడాది జనవరి 12 వరకు (Bheemla Nayak movie release date) వేచిచూడాల్సిందే.

Trending News