Savitri W/o Satyamurthy trailer: సావిత్రి w/o సత్యమూర్తి ట్రైలర్.. ఆమెకి 60, అతడికి 20 ఏళ్లు..

Savitri W/o Satyamurthy Trailer: కేరింత సినిమాలో నూకరాజు పాత్రతో ఉత్తరాంధ్ర యాసలో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన పార్వతీశం (Parvateesham) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా.. అతడికి సతీమణిగా, జంటగా సీనియర్ నటి శ్రీలక్ష్మి (Srilaxmi) నటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 18, 2021, 08:46 PM IST
Savitri W/o Satyamurthy trailer: సావిత్రి w/o సత్యమూర్తి ట్రైలర్.. ఆమెకి 60, అతడికి 20 ఏళ్లు..

Savitri W/o Satyamurthy Trailer: సావిత్రి w/o సత్యమూర్తి.. టైటిల్‌కి తగినట్టుగానే ఇదో వెరైటీ స్టోరీతో తెరకెక్కిన మూవీ అని సావిత్రి w/o సత్యమూర్తి ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దర్శకుడు చైతన్య కొండ చేసిన ఈ ప్రయత్నం చూస్తోంటే.. రొటీన్‌కి భిన్నంగా కొత్త పాయింట్ టచ్ చేయాలని ప్రయత్నించినట్టు అనిపిస్తోంది. కేరింత సినిమాలో నూకరాజు పాత్రతో ఉత్తరాంధ్ర యాసలో ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేసిన పార్వతీశం (Parvateesham) ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించగా.. అతడికి సతీమణిగా, జంటగా సీనియర్ నటి శ్రీలక్ష్మి (Srilaxmi) నటించింది. అదేంటి.. అంత యువ నటుడికి అంత సీనియర్ నటి జంటగా నటించడం ఏంటని అనుకుంటున్నారా ? అయితే ఇంక ఆలస్యం చేయకుండా సావిత్రి w/o సత్యమూర్తి ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.

Also read : Hanu-Man first look: హనుమాన్ ఫస్ట్ లుక్.. Tollywood నుంచి బాలీవుడ్‌కి మరో ఎపిక్ ?

సావిత్రి w/o సత్యమూర్తి ట్రైలర్ చూశారు కదా.. ఒక వ్యక్తి వయస్సు 20 ఏళ్లు ఉన్నప్పుడు ఎలా ఉంటాడో అలాగే 60 కి పైబడిన ఏళ్ల వయస్సులోనూ ఉంటే ఎలా ఉంటుంది ? అతడి ప్రవర్తనతో కుటుంబసభ్యులకు ఎదురయ్యే అనుభవాలు ఎలా ఉంటాయనే కోణంతో సావిత్రి w/o సత్యమూర్తి మూవీ (Savitri W/o Satyamurthy movie) తెరకెక్కినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. అతడి వయస్సు అలా ఉండిపోవడానికి కారణం ఏంటి ? ఆ రహస్యం ఏంటనేది ? అసలు ఇందులో నిజం ఎంతనేది సినిమా చూస్తే కానీ తెలిసే ఛాన్స్ లేదు.

Also read : Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌లో రామ్‌చరణ్‌.. హౌజ్‌మేట్స్‌ను సెట్ చేస్తానన్న నాగ్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News