Chandu suicide: ఐదేళ్లుగా పవిత్రతో నాభర్త ఎఫైర్... నిజాలను ఏడుస్తు బైటపెట్టిన భార్య శిల్ప..

Serial actor Chandu death: సీరియల్ నటుడు చందు సూసైడ్ చేసుకొని చనిపోవడం ప్రస్తుతం వారి కుటుంబంలో తీవ్ర విషారకంగా మారింది. ఈ నేపథ్యంలో తన భర్త, పవిత్రతో ఐదేళ్లుగా ఎఫైర్ కొనసాగిస్తున్నాడంటూ శిల్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - Inamdar Paresh | Last Updated : May 18, 2024, 04:39 PM IST
  • పవిత్ర ఆత్మ తనను పిలుస్తుందన్న చందు..
  • ఇలా చేస్తాడని అనుకోలేదన్న కరాటే కళ్యాణీ
Chandu suicide: ఐదేళ్లుగా పవిత్రతో నాభర్త ఎఫైర్... నిజాలను ఏడుస్తు బైటపెట్టిన భార్య శిల్ప..

Serial Actor chandu suicide wife shilpa hot comments: బుల్లితెర నటుడు చందు సూసైడ్ చేసుకొవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో తీవ్ర కలకలంగా మారింది. అయితే.. తన భర్త ఐదేళ్లుగా పవిత్రతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని అతని భార్య శిల్ప ఆరోపణలు చేశారు. త్రినయినీ సీరియల్ ప్రాజెక్టు ప్రారంభమైనప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసిందని చెప్పింది. పవిత్ర  తమ జీవితంలో రాకముందు తమతో ఎంతో బాగా ఉండేవడని చెప్పింది. పదకొండేళ్లనాటు ప్రేమలో ఉండి, పెద్దలను చెప్పి పెళ్లి చేసుకున్నామని అన్నారు. తమకు ఒక బాబు, ఒక పాప ఉన్నారని చెప్పుకొచ్చారు.  ఇటీవల పవిత్ర రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే.

Read more: Dice Snakes: ఆస్కార్ లెవల్ పర్ఫామెన్స్.. చచ్చిపోయినట్లు నటిస్తున్న పాములు.. కారణం ఏంటో తెలుసా..?

 అంతేకాకుండా.. ఆమె చనిపొయినప్పటి నుంచి తన భర్త డిప్రెషన్ లోకి వెళ్లాడని, తమ బిడ్డలతో కూడా సరగ్గా మాట్లాడేవాడు కాదని ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్ర పరిచయం తర్వాత పూర్తిగా ఇంటికి రావడం కూడా మానేశారని చెబుతూ కన్నీళ్లుపెట్టుకుంది. అంతే కాకుండా.. పవిత్ర మాయలో పడి తన పిల్లలను కూడా పట్టించుకోవడం మానేశాడని చెప్పుకొచ్చింది.త్రినయినీ సీరియల్ ప్రాజెక్టు స్టార్ట్ అయినప్పటి నుంచి వీరి మధ్య ఎఫైర్ మరీ ఎక్కువైందని చెప్పింది. పవిత్ర ఆకస్మిక మరణంతో ఇన్ స్టాలో, సోషల్ మీడియాల్లో ఆమె లేకుండా ఉండలేనని కూడా పోస్టులు పెట్టాడు. ఆమె మాయలో పడి తన ముఖం కూడా చూడటం ఇష్టంలేదని చెబుతుండేవాడని  చెప్పింది.

మరోవైపు చందు మరణంపై కరాటే కళ్యాణీ స్పందించారు. తనకు ఒక తమ్ముడు దూరమయ్యాడని, తనతో గతంలో మాట్లాడినప్పుడు సూసైడ్ చేసుకుంటానంటూ మాట్లాడారు. కానీ తాను ఎంతో ధైర్యం చెప్పానట్లు చెప్పాడు. పవిత్ర లేనిలోకంలో తాను ఉండలేనని, చందు తనతో పలుమార్లు చెప్పాడని, కానీ ఆత్మహత్య వద్దు. ఇది పాపం అని  చెప్పినట్లు కరాటే కళ్యాణి వాట్సాప్ చాట్ బైటపెట్టారు. విలన్ గ్యాంగ్ లో నా అసిస్టెంట్ గా చాలా సీరియల్స్ లో పనిచేసినట్లు చెప్పారు. తాను వ్యక్తిగత పనుల మీద ఊరికి వెళ్లానని అప్పుడు తన తమ్ముడితో మాట్లాడటం కుదరలేదని, ఇంతలోనే ఇలాంటి విషాదం జరుగుతుందని ఊహించలేదని కరాటే కళ్యాణీ కన్నీళ్లు పెట్టుకుంది.

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

పవిత్ర తనను పిలుస్తోందని, ఆమె లేని లోకంలో కూడా ఉండలేనని, చందు చెప్తుండే వాడని, తాను అనేక మార్లు ఇలా మాట్లాడకుడదంటూ ధైర్యం చెప్పానని అన్నారు. నీకు భార్య, ఇద్దరు పిల్లలున్నారని, మంచి భవిష్యత్తు ఉందని చెప్పానని, ఇంతలోనే ఇలాంటి షాకింగ్ ఘటన  జరుగుతుందని ఊహించలేదని కరాటే కళ్యాణి ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News