Shahid Kapoor - Ashwatthama The Saga Continues: షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతున్న 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్'..

Shahid Kapoor - Ashwatthama The Saga Continues: మన హిందూ పురాణాల్లో ఎన్నో గొప్ప పాత్రలున్నాయి. అందులో అశ్వత్థామకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి పాత్రను ఈ ఆధునిక సమాజానికి అనుసంధానం చేస్తూ పూజా ఎంటర్టైన్మెంట్ సిద్ధమవుతోంది. షాహిద్ కపూర్ హీరోగా.. ఈ మాగ్నమ్ ఓపస్‌ను సచిన్ రవి తెరకెక్కిస్తున్నారు. ఊహకు, వాస్తవాలకు మధ్య ఉండే అద్భుతమైన కథను, గాధను 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్' గా చూపించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వంటి ఐదు భాషల్లో రాబోతుంది. 

Written by - TA Kiran Kumar | Last Updated : Mar 20, 2024, 11:06 AM IST
Shahid Kapoor - Ashwatthama The Saga Continues: షాహిద్ కపూర్ టైటిల్ రోల్లో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా రాబోతున్న 'అశ్వత్థామ ది సాగా కంటిన్యూస్'..

Shahid Kapoor - Ashwatthama The Saga Continues:ఈ చిత్రాన్ని మహా భారతంలోని చిరంజీవి అయిన ఓ యోధుడు (అశ్వత్థామ) స్టోరీని చెప్పబోతున్నారు. ఇక మన పురాణాల్లో సప్త చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. ఆయన ఇప్పటికీ బతికే ఉన్నారనేది మన పురాణాలు చెబుతున్నాయి. అప్పటి యుగానికి చెందిన అశ్వత్ధామ.. నేటి యుగంలో ఎలాంటి పరిస్థితులను సవాళ్లను ఎదుర్కొన్నాడనేది ఇందులో చూపించబోతున్నాడు. హై యాక్షన్ ప్యాక్డ్ సన్నివేశాలతో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. అమరజీవిగా వేల ఏళ్లు  ఎలా జీవించి ఉన్నాడనేది ఈ సినిమాలో చూపించబోతున్నారు. పూర్తిగా సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఈ సినిమాలో చూపించబోతున్నారు.

ఈ సినిమా గతం, వర్తమానం మధ్య జరిగే సంఘర్షణాత్మక యుద్దం అని చెప్పుకొచ్చారు. ఇందులో సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునేలా తెరకెక్కిస్తున్నట్టు చెబుతున్నారు. ఈ సందర్బంగా నిర్మాత జాకీ భగ్నాని మాట్లాడుతూ.. “మేము చేపట్టే ప్రతి ప్రాజెక్ట్ కేవలం ఎంటర్టైన్మెంట మాత్రమే కాదు.. ప్రేక్షకులకు మరిచిపోలేని ఓ అద్భుతమైన అనుభవాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తాము. ప్రేక్షకుల హృదయాలు, మనస్సులపై శాశ్వత ప్రభావాన్ని చూపించేలా ఉండాలే సినిమాలను నిర్మిస్తామన్నారు. బడే మియా చోటే మియా తర్వాత, నేను ఊహించని సినిమా చేయాలనుకున్నాను.  ఇది మనందరికీ తెలిసిన కథ. ఈ కథపై ప్రస్తుత ఆధునిక కాల పరిస్థితులు, వాటి వల్ల ఆ లెజెండ్ చేయాల్సి వచ్చిన యుద్దం ఏంటన్నది ప్రేక్షకులు కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుందన్నారు.  

దర్శకుడు సచిన్ రవి మాట్లాడుతూ.. అమరత్వం అనేది అప్పటికీ ఎప్పటికీ  చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇందులో చాలా భావోద్వేగాలు, నాటకీయ దృశ్యాలను రేకెత్తించే ఆస్కారం ఉంటుంది. మహాభారతంలోని అశ్వత్థామ ఈనాటికీ జీవిస్తున్నాడని  నమ్ముతుంటారు. అతనుచ చిరంజీవి అని మన పురాణాలు ఘోషిస్తున్నాయి. అటువంటి మహానుభావున్ని కథనాన్ని లోతుగా పరిశోధించాలనే నా కోరికకు  బీజం పడిందన్నారు.  నా లక్ష్యం ఈ కథకు ప్రాణం పోసి, ప్రస్తుత కాలక్రమంలో అతనిని ఉంచడం.. అమర జీవి యొక్క సంక్లిష్టమైన మనస్తత్వం ఎలా ప్రభావితం అవుతుందనే ఈ సినిమాలో చూపించబోతున్నాము. అతను వేల సంవత్సరాలుగా చూసిన ప్రపంచాన్ని అతను ఎలా గ్రహించాడో అన్వేషించడనే అనే పాయింట్స్ ఆసక్తికరంగా ఉంటాయి. ఈ కథను భారీ ఎత్తున, మునుపెన్నడూ చూడని యాక్షన్ చిత్రంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామన్నారు. అశ్వత్ధామ ది సాగా కంటిన్యూస్' చిత్రాన్ని పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వాషు భగ్నాని, జాకీ భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్‌లు నిర్మించారు. సచిన్ రవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా త్వరలోనే థియేటర్‌లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

Also read: AP Summer Holidays: విద్యార్ధులకు శుభవార్త, ఈసారి ముందస్తు సెలవులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News