Sharwanand Marriage : రూమర్లకు చెక్.. శర్వానంద్ పెళ్లి తేది ఖరారు.. వేదిక ఎక్కడంటే?

Sharwanand Marriage Date శర్వానంద్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు శర్వానంద్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందనే రూమర్లు వచ్చాయి. కానీ ఇప్పుడు శర్వానంద్ రక్షితల పెళ్లి మీద ఓ క్లారిటీ వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 17, 2023, 03:46 PM IST
  • నెట్టింట్లో శర్వానంద్ పెళ్లి వార్తలు
  • జైపూర్‌ పాలెస్‌లో వివాహా వేదిక
  • రెండు రోజుల పెళ్లిలో శర్వా సందడి
Sharwanand Marriage : రూమర్లకు చెక్.. శర్వానంద్ పెళ్లి తేది ఖరారు.. వేదిక ఎక్కడంటే?

Sharwanand Marriage Date టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్నాడు. ఇన్ని రోజులు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందంటూ రూమర్లు వచ్చాయి. కానీ అవన్నీ తప్పుడు వార్తలని తేలిపోయాయి. శర్వానంద్ రక్షితల పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. జూన్ 3న వీరిద్దరికి జైపూర్‌లోని ప్యాలెస్‌లో వివాహాం ఫిక్స్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. రెండు రోజుల ఈ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ నుంచి ప్రముఖ సెలెబ్రిటీలు హాజరు అవుతున్నట్టుగా తెలుస్తోంది.

శర్వానంద్ ఇప్పుడు వరుసగా ఫ్లాపులతో సతమతం అవుతున్నాడు. మహా సముద్రం, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ చేసిన ఆ సినిమాలు శర్వానంద్‌ను దెబ్బ కొట్టేశాయి. అయితే అంతకు ముందు చేసిన రాధ, రణరంగం వంటి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. అసలు శర్వానంద్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతోంది. సినీ కెరీర్ ఇలా ఉంటే.. పర్సనల్ కెరీర్ మీద కూడా రకరకాల రూమర్లు వస్తూనే ఉన్నాయి.

శర్వానంద్ తన ఎంగేజ్మెంట్‌ను క్యాన్సిల్ చేసుకున్నాడని, పెళ్లి చేసుకోవడం లేదని రూమర్లు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆ రూమర్లకు చెక్ పెట్టేసినట్టు అవుతోంది. ఈ పెళ్లి వేడుకలు రెండు రోజులు జరుగుతాయట. జూన్ 2న హల్దీ, మెహెందీ ఈవెంట్లు ఉండబోతోన్నాయట. ఇక జూన్ 3న పెళ్లి కొడుకు చేయడం, అదే రోజును పెళ్లి కూడా ఉంటుందని తెలుస్తోంది. ఈ పెళ్లి వేడుకలకు టాలీవుడ్ టాప్ హీరోలంతా వెళ్తారని తెలుస్తోంది.

Also Read:  Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?

శర్వానంద్ కోసం రామ్ చరణ్‌ దంపతులు, ప్రభాస్ కచ్చితంగా పెళ్లికి వెళ్తారని తెలుస్తోంది. ఈ ఇద్దరితో ప్రభాస్ ఎంత క్లోజ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. అయితే శర్వానంద్ పెళ్లి కోసం తన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినట్టుగా సమాచారం. శర్వానంద్ చివరగా చేసిన ఒకే ఒక జీవితం సినిమా కాస్త ఊపిరినిచ్చినట్టు అయింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

Also Read:  Naresh Pavitra Kiss : రెచ్చిపోయిన జంట.. షోలో నరేష్ పవిత్రల ముద్దులు.. బంధం మీద క్లారిటీ వచ్చేసినట్టే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News