నిజంగానే జాహ్నవి కపూర్‌కి ఎంత కష్టమొచ్చింది ?

రెండు వారాల క్రితమే తల్లిని కోల్పోయిన జాహ్నవి కపూర్ తిరిగి తన తొలి సినిమా సెట్స్‌లో ప్రత్యక్షమైంది.

Last Updated : Mar 9, 2018, 03:48 PM IST
నిజంగానే జాహ్నవి కపూర్‌కి ఎంత కష్టమొచ్చింది ?

రెండు వారాల క్రితమే తల్లిని కోల్పోయిన జాహ్నవి కపూర్ తిరిగి తన తొలి సినిమా సెట్స్‌లో ప్రత్యక్షమైంది. శ్రీదేవి మృతితో తల్లి లేని పిల్ల అయిన జాహ్నవి కపూర్ ఆ బాధతో కొంత కాలం సినిమాలకు దూరంగా వుంటుందని అందరు భావించారు. కానీ జాహ్నవి కపూర్ మాత్రం 21 ఏళ్ల చిన్న వయస్సులోనూ పెద్ద మనస్సుతోనే ఆలోచించింది. జాహ్నవి కపూర్‌ని సినీ పరిశ్రమకు పరిచయం చేస్తోన్న ధడక్ సినిమా మరికొద్ది రోజుల్లోనే రిలీజ్ కావాల్సి వుంది. అయితే, ఇంకా చాలా షూటింగ్ భాగం మిగిలిపోయి వుండటంతో తన వల్ల ఆ సినిమా విడుదల ఆలస్యం కాకూడదనే ఆలోచనతో జాహ్నవి గురువారమే ధడక్ సినిమా షూటింగ్‌కి హాజరైంది.

ముంబై మిర్రర్ కథనం ప్రకారం ముంబైలోని బాంద్రాలో వున్న కార్టర్ రోడ్‌లో ఈ షూటింగ్ జరుగుతోంది. రానున్న కొద్దిరోజులపాటు ఇక్కడ పలు రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు ముంబై మిర్రర్ కథనం పేర్కొంది. నిజంగా తల్లి చనిపోయిన పది రోజులకే ఓ వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య బర్త్ డే జరుపుకోవాల్సి వచ్చిన జాహ్నవి కపూర్‌కి ఇప్పుడు ఇలా ఇంత బాధలోనూ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాల్సి రావడం ఎంత బాధాకరం!

Trending News