నటి ప్రగతి స్టెప్పేస్తే.. సోషల్ మీడియాలో ప్రగతి డ్యాన్స్ వీడియో వైరల్

తెలుగు సినిమా ఆడియెన్స్‌కి నటి ప్రగతి ( Actress Pragathi ) పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రకు న్యాయం చేసిన నటి ప్రగతి కేవలం నటనలోనే కాదు... సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు విడుదల చేస్తోంది.

Updated: Jun 1, 2020, 04:31 PM IST
నటి ప్రగతి స్టెప్పేస్తే.. సోషల్ మీడియాలో ప్రగతి డ్యాన్స్ వీడియో వైరల్

తెలుగు సినిమా ఆడియెన్స్‌కి నటి ప్రగతి ( Actress Pragathi ) పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సినిమాల్లో అత్త, పిన్ని, తల్లి పాత్రలు పోషించి ఆ పాత్రకు న్యాయం చేసిన నటి ప్రగతి కేవలం నటనలోనే కాదు... సరైన అవకాశం వస్తే.. డ్యాన్స్‌లోనూ ఇరగదీస్తాను అనేలా అప్పుడప్పుడు కొన్ని వీడియోలు విడుదల చేస్తోంది. ప్రగతి డ్యాన్స్ వీడియోలు వైరల్ అవుతున్నాయి కూడా. తాజాగా సోషల్ మీడియాలో నటి ప్రగతి సోలో డ్యాన్స్ వీడియో మరొకటి వైరల్ అవుతోంది. ఉన్నచోటు నుంచి కదలకుండానే.. తన నడుముని మాత్రమే లయబద్దంగా షేక్ చేసిన ప్రగతి డ్యాన్స్ వీడియో ( Actress Pragathi dance video ) చూస్తే.. ఆమెకు డ్యాన్స్ అంటే ఎంత క్రేజో అర్థమవుతోంది. మరి ఇంకెందుకు ఆలస్యం... ప్రగతి డ్యాన్స్ మూవ్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

( Read also : Mahesh Babu: సర్కార్ వారి పాట.. ఫ్యాన్స్‌ని సస్పెన్స్‌కి గురిచేస్తోన్న పోస్టర్‌ )

కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ సమయంలో షూటింగ్స్ నిలిపేయడంతో ఇంట్లో ఖాళీగా ఉంటూ ఇదివరకు షేర్ చేసుకున్న ప్రగతి డ్యాన్స్ వీడియో అప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.

ఈ వీడియోలు చూసిన నెటిజెన్స్.. నటి ప్రగతికి డ్యాన్స్ చేసే అవకాశం వస్తే ఇరగదీసేలా ఉందంటున్నారు. అవకాశం అంటే గుర్తుకొస్తోంది... బాద్‌షా సినిమాలోనూ ఓ సన్నివేశంలో సీనియర్ ఎన్టీఆర్ నటించిన పాత సినిమాలోని ఐటం సాంగ్‌కి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి స్టెప్పేసిన తీరు ఎంతో ఆకట్టుకోవడం అందరికీ గుర్తుండే ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..