AHA OTT: నష్టాల్లో ఆహా ఓటీటీ, అమ్మకానికి సిద్ధం కారణాలేంటి

AHA OTT: ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహా అమ్మకానికి సిద్ధమైంది. మార్కెట్‌లో ఉన్న ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి పోటీ, ఇతర సవాళ్లు పెరగడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2024, 01:59 PM IST
AHA OTT: నష్టాల్లో ఆహా ఓటీటీ, అమ్మకానికి సిద్ధం కారణాలేంటి

AHA OTT: ప్రముఖ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ కో ఫౌండర్‌గా ప్రారంభమైన ఆహా ఓటీటీకు అనతికాలంలోనే ఆదరణ పెరిగింది. రెండేళ్ల క్రితం ఆహా తమిళం కూడా ప్రారంభమైంది. మార్కెట్‌లోని ఇతర ఓటీటీలకు దీటుగా వ్యూయర్‌షిప్ సాధించినా..లాభాలు ఆర్జించలేకపోతోంది. అందుకే ఇప్పుడు అమ్మకానికి సిద్ధమైంది. 

తెలుగు ప్రజలకు సుపరిచితమైన ఆాహా ఓటీటీని అమ్మకానికి పెట్టారు. ఇతర ఓటీటీల నుంచి సవాళ్లు పెరగడమే కాకుండా సినిమాలు, వెబ్‌సిరీస్ ఇతర కంటెంట్ ధరలు భారీగా పెరగడంతో ఆహా తట్టుకోలేకపోతోంది. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5ల నుంచి పోటీ ఎక్కువైంది. కొత్త కొత్త తెలుగు సినిమాలు ఎక్కువగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లోనే విడుదలవుతున్నాయి. సినిమాలను ఈ ఓటీటీలు భారీ ధర చెల్లించి తీసుకుంటున్నాయి. ఫలితంగా ఆహా వెనుకబడిపోతోంది. సబ్‌స్క్రిప్షన్ కూడా ఇతర ఓటీటీలతో పోలిస్తే చాలా చాలా తక్కువ. అందుకే ఆహా ఓటీటీని విక్రయించేందుకు యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 

అయితే ఆహాలో కొద్ది వాటా విక్రయించడమా లేక పూర్తిగా విక్రయించడమే అనేది ఇంకా నిర్ణయం కాలేదు. ఇప్పటి వరకూ సోనీ నెట్‌వర్క్ ఆహా కొనుగోలుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఆహాను నడుపుతున్న అర్హా మీడియా బ్రాడ్ కాస్టింగ్‌తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ వార్తల్ని సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా కొట్టిపారేసింది. 

Also read: Eagle OTT Streaming: రవితేజ అభిమానులకు డబుల్ ధమాకా.. ఆ రోజు నుంచి రెండు ఓటీటీల్లో 'ఈగల్' మూవీ స్ట్రీమింగ్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News