Beast Movie In OTT: బీస్ట్ మూవీ ఓటిటిలోకి అప్పుడే..!

Beast Movie In OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో ఇండియా వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2022, 02:53 PM IST
  • బీస్ట్ మూవీ ఓటిటిలోకి
  • ఈ నెల 11న ఓటిటిలో విడుదల
  • నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ విడుదల చేయనున్నట్లు సమాచారం
Beast Movie In OTT: బీస్ట్ మూవీ ఓటిటిలోకి అప్పుడే..!

Beast Movie In OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్‌'. ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో ఇండియా వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా తమిళంలో మంచి  కలెక్షన్స్‌ రాబట్టుకున్న..తెలుగులో విజయ్‌ ఫ్యాన్స్‌ను అలరించలేకపోయింది. ఇందులో విజయ్ గెటప్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ఈ సిమాలో  ‘రా’ ఏజెంట్‌గా దళపతి నటించగా.. పూజా హెగ్డే కథానాయికగా నటించింది. సినిమాలో చెన్నైలోని ఓ షాపింగ్ మాల్‌ను టెర్రరిస్టులు హైజాక్ చేసి అందులోని కొందరు ప్రజల్ని బంధీలుగా చేసుకుంటారు. దీంతో హీరో దళపతి రంగంలోకి దిగి వారిని కాపాడి బైటికి తీసుకొస్తాడు. దీని తరువాత కొనసాగిన కథే బీస్ట్‌.

ఈ చిత్రంలో కథ సీరియస్ మిషన్ నుంచి కామెడీ యాంగిల్‌లో ప్రెజెంట్ చేయడంతో సినీ క్రిటిక్స్ నుంచి చాలా విమర్శలొచ్చాయి. తమిళనాడులో ఈ సినిమాకు మంచి రికార్డ్స్‌ వచ్చిన.. తెలుగు సిని ప్రేక్షక లోకంలో ఊహించిన కలెక్షన్స్‌ రాలేకపోయాయి.అయితే ఈ సినిమా ఏప్రిల్ 13న విడుదలై చాలా తక్కువ సమయంలోనే OTTలో రావాడం గమనార్హం. ఈ నెల 11న ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్, సన్ నెక్స్ట్ లో స్ట్రీమ్ చేయబోతున్నారని సమాచారం. తమిళంలో మంచి పేరుతెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Also Read: Yogi Adityanath: సీఎం అయ్యాక మొదటిసారి తన తల్లిని కలుసుకున్న యోగి

Also Read: Hyderabad: నగరవాసులకు విజ్ఞప్తి... మీ ఏరియాలో విద్యుత్ అంతరాయం ఉంటే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News