Sarkaru vaari paata update: మహేశ్ మూవీ నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. టైటిల్ సాంగ్ వచ్చేది రేపే!

Sarkaru vaari paata update: 'సర్కారు వారి పాట' మరో అప్డేట్ వచ్చేసింది. మరో మ్యూజికల్ ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమ్యయారు మేకర్స్. రేపు  ఈ చిత్ర టైటిల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 22, 2022, 06:47 PM IST
  • మహేశ్ అభిమానులకు శుభవార్త
  • రేపే టైటిల్ సాంగ్ రిలీజ్
Sarkaru vaari paata update: మహేశ్ మూవీ నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. టైటిల్ సాంగ్ వచ్చేది రేపే!

Sarkaru vaari paata update: సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట' (Sarkaru vaari paata). గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ దర్శకుడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. యూట్యూబ్ లో రికార్డ్సు సృష్టించాయి. 

ఈ నేపథ్యంలో అభిమానులకు మరో మ్యూజికల్  ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఈ చిత్రం నుంచి మూడో సింగిల్ రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ ను ప్రకటించింది చిత్రబృందం. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ (Sarkaru vaari paata Title Song) ను రేపు ఉదయం 11.07 గంట‌ల‌కు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రేపు మోత మోగిపోవాలా అంటూ దీనికి క్యాప్షన్ ఇచ్చారు. 

ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ సంస్థ‌ల‌తో క‌లిసి మ‌హేష్​బాబు స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. బ్యాంకింగ్ స్కామ్‌ల నేప‌థ్యంలో ఈ మూవీ తెర‌కెక్కిన‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఆర్ మధి సినిమాటోగ్రాఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 12న రిలీజ్ కానుంది.

Also Read: Acharya Movie Update: మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. 'ఆచార్య' సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News