Varalaxmi Sarathkumar: విదేశాలలో పెళ్లి చేసుకోనున్న వరలక్ష్మి శరత్ కుమార్.. రిసెప్షన్ ఎక్కడంటే?

Varalaxmi Sarathkumar Marriage Details: తెలుగు ప్రేక్షకులను..వివిధ పాత్రలతో.. అలరించిన నటి వరలక్ష్మీ శరత్ కుమార్. ముఖ్యంగా ఈ హీరోయిన్ తన నెగిటివ్ పాత్రల ద్వారా బాగా పాపులర్ అయింది. కాగా ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 28, 2024, 09:15 PM IST
Varalaxmi Sarathkumar: విదేశాలలో పెళ్లి చేసుకోనున్న వరలక్ష్మి శరత్ కుమార్.. రిసెప్షన్ ఎక్కడంటే?

Varalaxmi Sarathkumar Reception Details: శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్..గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. కేవలం హీరోయిన్ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. అలానే నెగిటివ్ పాత్రలలో కనిపించి..ఈ నటి..తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా వరలక్ష్మి శరత్ కుమార్ తెలుగులో వచ్చిన క్రాక్ సినిమాతో మంచి పేరు తెచ్చుకునింది. ఇక ఆ తరువాత బాలకృష్ణతో చేసిన వీర సింహారెడ్డి సినిమా కూడా ఈ నటికి మంచి విజయం సాధించి పెట్టింది.

ఇలా అన్ని రకాల అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న టైంలో.. తన పెళ్లి గురించి ఈ మధ్యనే ప్రకటించింది వరలక్ష్మి. ఈ మధ్యనే తన ప్రియుడు నికోలాయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరలక్ష్మి ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోంది. వరలక్ష్మి శరత్‌ కుమార్ పెద్ద కుమార్తె, నటి వరలక్ష్మి.. ఆమె చిరకాల స్నేహితుదు నికోలాయ్ సచ్‌దేవ్ ఇటీవల ముంబైలోని ఒక స్టార్ హోటల్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. కాగా త్వరలోనే పెళ్లితో వీరిద్దరూ మరింత దగ్గర కాబోతున్నారు. ఇప్పటికే ఆమె పెళ్ళికి సంబంధించిన సన్నాహాలు మొదలు కాగా, ఈ సెలబ్రిటీ కపుల్ పెళ్లి, రిసెప్షన్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు కూడా ఇప్పుడు బయటకువచ్చాయి.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జూలై 2న వరలక్ష్మి శరత్‌ కుమార్, నికోలా సచ్‌దేవ్‌ల వివాహం జరగబోతోందని సమాచారం. కాగా పెళ్లికి ముందు రోజు చెన్నైలోని.. తాజ్ హోటల్‌లో మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది. పెళ్లిని థాయ్‌లాండ్‌లో జరపాలని ఇరు కుటుంబాలు వారు నిర్ణయించుకోవడంతో.. నికోలా కుటుంబీకులు దానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారట. ఇక పెళ్లయిన తరువాత చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో వరలక్ష్మి, నికోలా గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది అని తెలుస్తోంది. ఈ రిసెప్షన్ కు పలువురు రాజకీయ నేతలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతారని వినికిరి. అయితే వీరిద్దరి పెళ్ళికి మాత్రం కేవలం ఇరు కుటుంబ సభ్యులు హాజరు కాబోతున్నారట.

Also read: 7th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్, జూలైలో జీతం, డీఏ రెండూ పెంపు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News