Venkatesh Maha with Nani: లవ్ స్టోరీ చెప్పిన వెంకటేష్.. డైలమాలో నాని?

Venkatesh Maha Narrated a Story to Natural Star Nani: కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ మహా నానికి కథ చెప్పారని తెలుస్తోంది.

Written by - Chaganti Bhargav | Last Updated : Sep 21, 2022, 05:14 PM IST
Venkatesh Maha with Nani: లవ్ స్టోరీ చెప్పిన వెంకటేష్.. డైలమాలో నాని?

Venkatesh Maha Narrated a Story to Natural Star Nani: శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని తన హిట్ల పరంపర కొనసాగించాలని చూస్తున్నారు. ఇప్పటికైనా శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ లో దసరా అనే సినిమా చేస్తున్నాడు ఆయన. తెలంగాణ ప్రాంతానికి చెందిన సింగరేణి గనుల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.  పూర్తిస్థాయి తెలంగాణ సినిమా కావడంతో నాని తెలంగాణ మాండలికం కూడా ఒక ప్రత్యేక ట్యూటర్ ను నియమించుకుని మరీ నేర్చుకుంటున్నాడు. ఈ సినిమాతో ఎలా అయినా హిట్టు కొట్టగలనని నాని నమ్ముతున్నాడు.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాని మునుపెన్నడు కనిపించని ఒక మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు ఈ విషయం మీద క్లారిటీ వచ్చేలా చేశాయి. ఇక నాని తన తదుపరి సినిమాల మీద దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఒక కొత్త దర్శకుడికి నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అదేమిటంటే నానికి వెంకటేష్ మహా కథ చెప్పారని తెలుస్తోంది. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్ మహా ఆ తర్వాత ఒక మలయాళ సూపర్ హిట్ సినిమాను తెలుగులో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అనే పేరుతో రీమేక్ చేసి నెట్ఫ్లిక్స్ లో విడుదల చేశారు. ఆ తర్వాత ఆయన మోడరన్ లవ్ హైదరాబాద్ అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం ఒక వెబిసోడ్ దర్శకత్వం వహించారు.

కానీ ఆయన తదుపరి చిత్రం మీద ఎలాంటి క్లారిటీ లేదు. తాజాగా ఆయన ఒక మంచి లవ్ స్టోరీని నానికి నెరేట్ చేశారని తెలుస్తోంది. అయితే నాని కథ నచ్చినా సరే ప్రస్తుతానికి హోల్డ్ లో ఉంచారని చెబుతున్నారు. ఎందుకంటే నాని ఇప్పుడు చేస్తున్న దసరా సినిమా అనేది ఒక పూర్తి స్థాయి మాస్ మసాలా ఎంటర్టైనర్. ఆ తర్వాత వేనంటే నాని లవ్ స్టోరీ చేస్తే వర్కౌట్ అవుతుందా లేదా అనే ఆలోచనలో పడ్డారని తెలుస్తోంది. నాని ఓకే అనుకుంటే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వెలువడే అవకాశం కనిపిస్తుంది. 
Also Read: Koratala Siva Tension: ఎన్టీఆర్ ఫోన్ వస్తే వణికిపోతున్న కొరటాల.. చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధం?

Also Read: SSMB 28 Shoot:అప్పుడే SSMB 28 మొదటి షెడ్యూల్ పూర్తి.. ఇంకా రచ్చ ఉంటుందన్న నిర్మాత!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x