Varun Tej: ఎఫ్3 మూవీ షూటింగ్ ప్రారంభం

F3 movie shooting begins in hyderabad : కామెడీ జానర్‌లో వచ్చి విజయవంతమైన మూవీ F2(ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. గురువారం నాడు హైదరాబాద్‌లో ఎఫ్3 (F3 Movie) మూవీ షూటింగ్ ప్రారంభమైంది.

Last Updated : Dec 17, 2020, 03:40 PM IST
  • మరో వినోదాన్ని అందించనున్న వెంకటేష్, వరుణ్ తేజ్
  • నేడు హైదరాబాద్‌లో ఎఫ్3 మూవీ షూటింగ్ ప్రారంభం
  • పూజా కార్యక్రమాలలో పాల్గొన్న వరుణ్ తేజ్, తమన్నా
Varun Tej: ఎఫ్3 మూవీ షూటింగ్ ప్రారంభం

కామెడీ జానర్‌లో వచ్చి విజయవంతమైన మూవీ F2(ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్). అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ గతేడాది విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ ఎంటర్‌టైన్మెంట్ మరింత ముందుకు సాగనుంది. 

Also Read: HBD Venkatesh: విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు కానుక..F3 పోస్టర్ విడుదల

ఎఫ్2 మూవీకి సీక్వెల్ తీస్తున్నట్లు మూవీ యూనిట్ ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం నాడు హైదరాబాద్‌లో ఎఫ్3 (F3 Movie) మూవీ షూటింగ్ ప్రారంభమైంది. మూవీ షూటింగ్ పనులకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నేడు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో వరుణ్ తేజ్ (Varun Tej), హీరోయిన్ తమన్నా భాటియా పాల్గొన్నారు. వరుణ్ తేజ్ షూటింగ్ పూజా కార్యక్రమం ఫొటోలను ట్వీట్ చేశారు.

Also Read: Disha Patani: సోషల్‌మీడియా రారాణి దిశా పటాని.. ఫొటో పోస్ట్ చేస్తే చాలు!

 

 

    వరుణ్ తేజ్, తమన్నాలపై ఓ సన్నివేశానికి క్లాప్ కొట్టి షూటింగ్ పనులు ప్రారభించారు టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్. దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత దిల్ రాజు సహా మరికొందరు మూవీ టెక్నీషియన్లు, సిబ్బంది ఎఫ్3 మూవీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. త్వరలో ఈ మూవీకి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఎఫ్3 మూవీ యూనిట్. 

    Also Read: Kajal Aggarwal at Acharya sets: హనీమూన్ నుంచి ఆచార్య సెట్‌కు కాజల్, గౌతమ్ కిచ్లు 

    స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
    Android Link - https://bit.ly/3hDyh4G

    Apple Link - https://apple.co/3loQYe 

    • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

    Trending News