Venu Swamy: అప్పుడు వేణు స్వామి మాటల్లో లేని కాంట్రవర్సీ.. ఇప్పుడు మాత్రమే ఎందుకు?

Naga Chaitanya- Sobhita: వేణు స్వామి కొన్ని సంవత్సరాలుగా తనకు తోచిన జాతకం చెబుతూ వచ్చారు. కానీ తాజాగా నాగచైతన్య, శోభిత మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇప్పుడు లేనిపోని వివాదాల్లో ..ఇరుక్కొని వేణు స్వామి పరిస్థితులు తన పీకల మీదకి తెచ్చుకున్నాడు. 

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 22, 2024, 10:41 PM IST
Venu Swamy: అప్పుడు వేణు స్వామి మాటల్లో లేని కాంట్రవర్సీ.. ఇప్పుడు మాత్రమే ఎందుకు?

Venu Swamy Controversy:సెలబ్రిటీలకు జాతకాలు చెబుతూ, వాళ్ల దగ్గర పూజలు చేయించుకుంటూ వేణు స్వామి బాగా వైరల్ అవుతూ వచ్చాడు. ఏదో నోటికి వచ్చిన నాలుగు ముక్కలు జ్యోతిష్యం చెప్పుకొని.. సెలబ్రిటీలను కాస్త భయపెట్టి.. పూజలని, హోమాలని పబ్బం గడుపుకునేవాడు. గతంలో నాగచైతన్య, సమంత విడిపోతారు అని వేణు స్వామి చెప్పినప్పుడు ఎవరు స్పందించలేదు. అప్పుడు ఎటువంటి కాంట్రవర్సీలు తలెత్తలేదు. 

ప్రేమించి పెళ్లి చేసుకుని హాయిగా గడుపుతున్న సమయంలో వేణు స్వామి నోటి ప్రభావమో.. లేక నిజంగానే జాతకాల మహిమో తెలియదు కానీ మొత్తానికి సమంత, నాగచైతన్య విడిపోయారు. అలాగే ఓ ఇద్దరు ముగ్గురికి విషయంలో కూడా వేణు స్వామి చెప్పిన మాటలు లక్కీగా నిజమయ్యాయి. దీంతో వేణు స్వామి పై కాస్త గురి కుదిరిన సెలబ్రిటీలు అతనితో పూజలు చేయించుకోవడానికి ఆసక్తి చూపించడం మొదలుపెట్టారు. 

సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ పెంచుకోవడం కోసం వేణు స్వామి సెలబ్రిటీల ఇళ్లకు వెళ్లి పూజలు చేసే సమయంలో తీసిన ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ కాస్త హడావిడి చేశాడు. అయితే రీసెంట్ గా నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ అనంతరం వాళ్ళిద్దరూ మూడు ఏళ్లలో విడిపోతారు అంటూ వేణు స్వామి జాతకం చెప్పడం అతను చేసిన పెద్ద పొరపాటుగా తయారైంది. 

గతంలో ఆంధ్రాలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలు అధికారంలో ఉన్న సమయంలో వేణు స్వామి వాళ్ళ సపోర్ట్ చూసుకొని బండి నడిపించేసాడు.. ఎన్నికలకు ముందు తాను చెప్పిన లెక్కలు తప్పడంతో ఇక జాతకాలే చెప్పను అన్న వేణు స్వామి నాగచైతన్య ఎంగేజ్మెంట్ అనంతరం ఆ జంట భవిష్యత్తుపై మాట్లాడాడు.

ఏదో శుభమా అని ఎంగేజ్మెంట్ చేసుకుంటే .. అపశకునపు మాటలు మాట్లాడుతావా.. ఇప్పటికే సమంత, నాగచైతన్య నీవల్ల విడిపోయారు అది చాలదా.. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా విడిపోవాలా అంటూ నెటిజన్లు వేణు స్వామి పై అటాక్ మొదలుపెట్టారు. మ్యాటర్ మరింత సీరియస్ అవుతుంది అనుకున్న టైం లో తెలివిగా తన భార్య శ్రీవాణిని పరిస్థితులు చక్కబెట్టడానికి రంగంలోకి దింపాడు వేణు స్వామి. అయితే ఆమె తన మాటల వైఖరితో పరిస్థితులను మరింత దారుణంగా తయారు చేసింది. 

ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ మరణ వాంగ్మూలం అంటూ వీడియోలు రిలీజ్ చేసే పరిస్థితికి చేరుకున్నారు. మూర్తితో పాటు ఫిలిం జర్నలిస్టులు కూడా ఇప్పుడు వేణు స్వామి, అతని భార్య శ్రీవాణి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అందరూ అసలు గొడవ ఎక్కడి నుంచి ప్రారంభమైంది అన్న విషయాన్ని గమనించడం లేదు. వేణు స్వామి ఎప్పుడైతే నాగచైతన్య రెండవ ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడాడో అప్పుడే సమస్యలు మొదలయ్యాయి. కాబట్టి వీడియోలలో వాంగ్మూలాలు ఇవ్వడం కంటే కూడా.. నాగచైతన్య, శోభిత కుటుంబాలకు సారీ చెప్పి ఇక మీద ఇలాంటివి చేయను అంటే సరిపోయేది. ఇప్పటికైనా వేణు స్వామి కాస్త ఆలోచించి ప్రవర్తిస్తే కష్టాల్లో ఇరుక్కోకుండా బయటపడతాడు.

Also Read : 1992 Ajmer Rape Cases : వంద మంది కాలేజీ అమ్మాయిలపై సామూహిక అత్యాచారం..32 ఏండ్ల తర్వాత నిందితులకు జీవిత ఖైదు

Also Read :  Gold Outlook: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే లక్ష దాటనున్న బంగారం ధర.. ఎప్పుడంటే ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x