Lokesh Kanagaraj: తెలుగులో ఏకంగా శంకర్ ని మించిపోయిన కోలీవుడ్ డైరెక్టర్..

Lokesh Kanagaraj: చేసినవి కొన్ని సినిమాలే అయినప్పటికీ వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ఇప్పుడు తెలుగులో శంకర్ వంటి స్టార్ డైరెక్టర్లను సైతం దాటి ముందుకు దూసుకు వెళ్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 18, 2023, 10:57 AM IST
Lokesh Kanagaraj: తెలుగులో ఏకంగా శంకర్ ని మించిపోయిన కోలీవుడ్ డైరెక్టర్..

Lokesh Kanagaraj:

1993 నుండి ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖ డైరెక్టర్లలో శంకర్ కూడా ఒకరు. తమిళ్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకి దర్శకత్వం వహించిన శంకర్ వాటిని తెలుగులో కూడా డబ్ చేసి టాలీవుడ్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. సౌత్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ల జాబితా చూస్తే రాజమౌళి తర్వాత ఉండే పేరు శంకర్ దే. భారీ బడ్జెట్ తో కూడా ఎక్స్పరిమెంటల్ సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ అందుకోవడం శంకర్ కు బాగా అలవాటు.

అయితే తాజాగా ఇప్పుడు మరొక కోలీవుడ్ డైరెక్టర్ తెలుగులో శంకర్ స్థానాన్ని ఆక్రమిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ మరెవరో కాదు లోకేష్ కనగరాజ్. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్లలో లోకేష్ పేరు బీభత్సంగా వినిపిస్తోంది. కేవలం నాలుగే నాలుగు సినిమాలతో తమిళ్ లో మాత్రమే కాక ఇటు తెలుగులో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు లోకేష్. 

ఈ మధ్య ఎక్కడ చూసినా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ గురించిన మాటలే వినిపిస్తూ ఉంటాయి. మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్ బట్టి సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకులకు అందించి తన సత్తా చాటిన లోకేష్ తదుపరి సినిమా లియో పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కాబోతోంది. త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, ప్రముఖ నటుడు అర్జున్ కీలక పాత్రలలో కనిపించనున్నారు. 

ఈ సినిమాపై ఉన్న భారీ క్రేజ్ తో లోకేష్ కనగరాజ్ తెలుగులో శంకర్ స్థానాన్ని ఆక్రమిస్తున్నారు అని కొందరు చెబుతున్నారు. తమిళ్ లో ఇప్పుడు లోకేష్ నంబర్ వన్ డైరెక్టర్గా మారిపోయారు. ఇటు తెలుగులో కూడా ఇప్పుడు లోకేష్ హవా బాగానే నడుస్తోంది. ఈ మధ్యకాలంలో శంకర్ కూడా వరుస సినిమాలో చేయకపోవడంతో సౌత్ ఇండస్ట్రీ మొత్తం లోకేష్ సినిమాల మీదనే దృష్టి పెడుతోంది. 

ఇంతకుముందు శంకర్ సినిమాలకి ఉండే క్రేజ్ ఇప్పుడు లోకేష్ సినిమాలకి ఉంది. ఇంకా చెప్పాలంటే లోకేష్ సినిమాలకి ఉన్న క్రేజ్ చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగు ప్రేక్షకులు కూడా శంకర్ సినిమాల కంటే ఎక్కువగా లోకేష్ సినిమాల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉదాహరణకి శంకర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో తీస్తున్న గేమ్ చేంజర్ సినిమాపై కంటే లియో సినిమా పైనే భారీ అంచనాలు ఉన్నాయి.

Also Read: Leo Title Controversy: 'లియో' టైటిల్ వివాదంపై ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ.. ఆ రోజే విడుదల..!

Also read: Janhvi Kapoor: బ్లాక్ డ్రెస్‌లో జాన్వీ కపూర్ టెంప్టింగ్ పోజులు.. కుర్రకారుకు నిద్రపట్టేనా..!

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x