Virata Parvam Trailer: అమ్మ నువ్ అతడిని కనిపించేలా చేస్తే.. కోన్ని కోసి, కళ్ళు శాఖ పోస్తా!

Rana Daggubati, Sai Pallavi's Virata Parvam Trailer is Out. కర్నూలులో నిర్వహించిన విరాట పర్వం కార్యక్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 5, 2022, 07:06 PM IST
  • అమ్మ నువ్ అతడిని కనిపించేలా చేస్తే
  • కోన్ని కోసి, కళ్ళు శాఖ పోస్తా!
  • రక్తపాతం లేకుండా మనమేం చేయలేమా చెప్పు
Virata Parvam Trailer: అమ్మ నువ్ అతడిని కనిపించేలా చేస్తే.. కోన్ని కోసి, కళ్ళు శాఖ పోస్తా!

Rana Daggubati, Sai Pallavi starring Virata Parvam movie Trailer released: రానా దగ్గుబాటి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'విరాట పర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంను డి సురేష్‌ బాబు సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో 1990ల్లో జరిగిన యదార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమా తెరకెక్కింది. పలుమార్లు వాయిదా పడుతూ వస్తున్న విరాట పర్వం చిత్రం ఎట్టకేలకు జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ ట్రైలర్‌ను విడుదల చేసింది.

3 నిమిషాల నిడివిగల విరాట పర్వం ట్రైలర్‌.. సాయి పల్లవితో ప్రారంభం అయింది. ఆపై రానా దగ్గుబాటి వాయిస్ ఓవర్‌ ఉంది. 'చిన్న ఎవడు.. పెద్ద ఎవడు.. రాజ్యమేలే రాజు ఎవడు.. సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్నినాళ్లు' అనే డైలాగ్ రానా చెబుతాడు. 'అమ్మ ఈ పుస్తకం రాసిండు కదా?.. అతడిని చుడాలనుంది. నువ్ గనక కనిపించేలా చేస్తే.. కోన్ని కోసి, కళ్ళు శాఖ పోస్తా', 'నీ అక్క రామన్న దళం వచ్చిందిరా', 'నేను నీకు అభిమాని అయిపోయాను.. దీనికి ఏ పేరు పెట్టాలో కూడా తెలియదు', 'నా కళ్ళలో నిజాయితీ కనిపిస్త లేదా?, ప్రేమ కనిపిస్తలేదా?', 'రక్తపాతం లేకుండా మనమేం చేయలేమా చెప్పు' అనే డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. 

ట్రైలర్‌ చూస్తుంటే.. ప్రజాసేవలో మునిగిపోయిన హీరోకు ప్రేమ అంటే పడదు అన్నట్లు కనిపిస్తున్నాడు. మరి వెన్నెల ప్రేమను అర్థం చేసుకుంటాడా? లేదా చూడాలి. నక్సలిజం నేపథ్యంలో సాగే ఓ అద్భుతమైన ప్రేమకథగా విరాట పర్వం సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో కామ్రేడ్‌ రవన్నగా రానా, ఆయన ప్రేయసి వెన్నెలగా సాయి పల్లవి నటించారు. నవీన్‌ చంద్ర సీనియర్‌ ఉద్యమకారుడు రఘన్నగా, ప్రియమణి కామ్రేడ్‌ భారతక్కగా నటించారు. 

Also Read: Major Collections: రెండ‌వ రోజు 'మేజ‌ర్' చిత్రం హవా.. మొత్తం ఎంత క‌లెక్ట్ చేసిందంటే?

Also Read: Samantha - Naga Chaitanya: నాగ చైతన్య కోసం.. స్టార్‌ హీరో సినిమా వదులుకున్న సమంత!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News