Thiruveer Masooda Movie : ఇంకోసారి ఆ సౌండ్ వస్తే థియేటర్లోంచి వెళ్లిపోదామని అనుకున్నా.. 'మసూద'పై వివేక్ ఆత్రేయ కామెంట్స్

Thiruveer Masooda Movie తిరువీర్, సంగీత ప్రధాన పాత్రలో నటించిన మసూద చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈక్రమంలో సినిమా గురించి యంగ్ దర్శకులంతా కూడా ఎంతో గొప్పగా చెప్పేశారు. సినిమా అందరినీ భయపెట్టేస్తుందని అన్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 05:39 PM IST
  • రేపు విడుదల కాబోతోన్న మసూద
  • సూదను వీక్షించిన యంగ్ దర్శకులు
  • థియేటర్లోంచి వెళ్లిపోదామనుకున్న వివేక్ ఆత్రేయ
Thiruveer Masooda Movie : ఇంకోసారి ఆ సౌండ్ వస్తే థియేటర్లోంచి వెళ్లిపోదామని అనుకున్నా.. 'మసూద'పై వివేక్ ఆత్రేయ కామెంట్స్

Thiruveer Masooda Movie : ‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో నిర్మాత రాహుల్, స్వధర్మ్ బ్యానర్‌ల మీద ఆడియెన్స్‌కు ఓ నమ్మకం ఏర్పడింది. ఈ నిర్మాత గానీ ఈ బ్యానర్ నుంచి గానీ సినిమాలు వస్తున్నాయంటే కచ్చితంగా అందరినీ మెప్పిస్తాయనే అంచనాలతో ఉంటారు. అలాంటి బ్యానర్ నుంచి ఇప్పుడు మసూద అనే చిత్రం రాబోతోంది. ఇందులో తిరువీర్, సంగీత వంటి వారు నటించారు. టీజర్, ట్రైలర్ చూసి అందరూ భయపడిపోయారు. ఈ హారర్, థ్రిల్లర్ సినిమాను టాలీవుడ్ యంగ్ దర్శకులంతా వీక్షించారు.

ఈ మసూద రేపు విడుదలవుతున్న సందర్భంగా మీడియా ముందుకు వచ్చింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమంలో కుర్ర డైరెక్టర్లంతా కూడా మసూద సినిమా గురించి,సినిమాను చూసిన ఎక్స్‌పీరియెన్స్ గురించి చెప్పుకొచ్చారు. సరైన హారర్ సినిమాగా మసూద వస్తోంది. ఇలాంటి చిత్రాలను థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుందని ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అన్నాడు. సరైన టీం కలిసి పని చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా ఉదాహరణగా నిలుస్తుందని, ఈ చిత్రానికి మ్యూజిక్, సౌండ్, కెమెరా అన్నీ చక్కగా కుదిరాయని కలర్ ఫోటో డైరెక్టర్ అన్నాడు.

ఇప్పుడు దర్శకులకు హారర్ సినిమా తీయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదని, కానీ ఇలాంటి సమయంలో హారర్ సినిమా తీసి అందరినీ భయపెట్టేశాడు అంటూ డైరెక్టర్ సాయి మీద వెంకటేష్‌ మహా ప్రశంసలు కురిపించాడు. సినిమా ప్రారంభమైన ఇరవై నిమిషాల్లోనే భయపెట్టేస్తాడని, ఇదేదో తేడాగా ఉందే అనే భయం కలుగుతుందంటూ మిడిల్ క్లాస్ మెలోడీస్ డైరెక్టర్ వినోద అన్నాడు.

వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. సినిమాలో కొన్ని సీన్లు భయపెట్టేస్తాయి, బెలూన్ పగిలే సౌండ్‌కి కూడా మనం భయపడతామని, ఇలాంటి సౌండ్ ఇంకోసారి వస్తే థియేటర్లోంచి బయటకు వెళ్తామని అనుకున్నానంటూ.. రాత్రి ఇంటికి వెళ్లాక కూడా ఒంటరిగా భోజనం చేయాలంటే భయం వేసిందంటూ చెప్పుకొచ్చాడు.

మసూద నిర్మాత రాహుల్ మాట్లాడుతూ.. జెన్యూన్‌గా ఓ మంచి సినిమాను తీశామని అనుకుంటున్నాం.. సినిమా బాగుంటే మిగతా భాషల్లో ఆటోమెటిగ్గా డబ్ అవుతుందని, థియేటర్లు పెరుగుతాయంటూ తన సినిమా మీదున్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ఇక తిరువీర్ అయితే ఈ పాత్ర తనకు రావడం, స్వధర్మ్‌ వాళ్లు అప్రోచ్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని అన్నాడు.

Also Read : Sankaranthi 2023 Movies : ఓవర్సీస్ మార్కెట్లో దారుణంగా బాలయ్య.. ఆ హీరోల ముందు చిరు కూడా చిత్తేనా?

Also Read : Ram Charan RC 15 Workout Video : వెకేషన్లో కూడా రెస్ట్ లేకుండా అదే పని.. రామ్ చరణ్‌ వీడియో వైరల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

 

Trending News