Air Asia Pay Day Sale Offer: ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్.. రూ.1499కే టికెట్.. ఎలా బుక్ చేయాలంటే?

AirAsia Latest Offer: ఎయిర్ ఏషియా ఇండియా విమాన టిక్కెట్లను చౌకగా బుక్ చేసుకోవడానికి ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ కింద, మీరు ఆగస్టు 15 నుండి డిసెంబర్ 31 వరకు ప్రయాణించవచ్చు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 29, 2022, 05:19 PM IST
  • ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్
  • కేవలం 1499కే ఫ్లైట్ టికెట్లు
Air Asia Pay Day Sale Offer: ఎయిర్ ఏసియా బంపర్ ఆఫర్.. రూ.1499కే టికెట్.. ఎలా బుక్ చేయాలంటే?

AirAsia Offer:రాబోతున్న మరి కొద్ది నెలల్లో మీకు ఎక్కడికైనా విమానంలో వెళ్లే ప్లాన్ ఉంటే కనుక ఇప్పుడే మీ టిక్కెట్‌ను బుక్ చేసుకోండి. అదేంటి అనుకుంటున్నారా, దానికి ఇదే సరైన సమయం. AirAsia India అతి చౌక విమాన ప్రయాణానికి అనువుగా ఉండేలాగా ఆఫర్ చేసింది. సరసమైన ధరలకే విమాన టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఎయిర్ ఏషియా ఇండియా ఒక అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. ఎయిర్ ఏషియా ఇండియా తన పే డే సేల్‌ను ప్రకటించింది. తాజాగా ప్రవేశపెట్టిన AirAsia India PayDay Saleలో రూ.1,499 నుండి విమాన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. 

జూలై 31 వరకు
ఎయిర్ ఏషియా ఇండియా ప్రవేశపెట్టిన ఈ సేల్ జూలై 28 నుండి 31 వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలో చేసే అన్ని బుకింగ్‌లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. అంటే, మీరు ఇప్పుడు రెండు రోజులకు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ లో భాగంగా టిక్కెట్లను బుక్ చేసుకుంటే, ఆగస్టు 15 మరియు డిసెంబర్ 31 మధ్య ప్రయాణం చేయవచ్చు. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ బేసిస్ లో ఈ ఆఫర్‌కు సంబంధించి, నిర్దిష్ట రూట్‌లో ఈ పథకం కింద కేటాయించిన సీట్లను విక్రయించిన తర్వాత సాధారణ ధరలు వర్తిస్తాయని ఎయిర్‌లైన్ తెలిపింది.

టిక్కెట్లను ఎలా బుక్ చేయాలి:
Air Asia Pay Day Sale కింద టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి, మీరు ముందుగా Air Asia వెబ్‌సైట్  http://airasia.co.in కి వెళ్లాలి. Pay Day Sale ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లపై మీరు 15 ఆగస్టు నుండి 31 డిసెంబర్ 2022 వరకు ప్రయాణించవచ్చు. ఇక నిజానికి జూలై 7-10 మధ్య రూ. 1,497 నుండి ప్రారంభమయ్యే ఛార్జీలతో ఉండేలా Air Asia  ఒక 'స్ప్లాష్ సేల్'ని కూడా ప్రకటించింది. 
Also Read: Shreya Dhanwanthary Hot: రెడ్ జాకెట్లో లోదుస్తులు లేకుండా రెచ్చిపోయిన తెలుగమ్మాయి.. నెవర్ బిఫోర్ అంతే!

Also Read: Ramarao on Duty Twitter Review: రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' హిట్టా ఫట్టా.. ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే..

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News