రైతు రుణాలు నా సొంత డబ్బుతో తీరుస్తాను: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మానవత్వంలో కూడిన ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. 

Last Updated : Aug 29, 2018, 09:42 PM IST
రైతు రుణాలు నా సొంత డబ్బుతో తీరుస్తాను: అమితాబ్ బచ్చన్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మానవత్వంలో కూడిన ఓ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. దేశంలో రైతులు రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని.. అందుకే తన సంపాదనలో కొంతభాగంతో వారి రుణాలను తీర్చాలని భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి 200 మంది రైతులను ఎంపిక చేయడం జరిగిందని.. వారి రుణాలను తీర్చడానికి తనవంతుగా రూ.1.25 కోట్ల రూపాయలను చెల్లించానని అమితాబ్ తెలిపారు. కేబీసీ ప్రెస్ కాన్ఫరెన్సులో భాగంగా అమితాబ్ ఈ విషయాన్ని తెలిపారు.

"దేశంలో ఎన్నో సమస్యలను మనం చూస్తున్నాం. అయితే అన్నింటికన్నా నన్ను బాగా కలచివేసిన విషయం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం. నేను వైజాగ్‌లో షూటింగ్‌లో ఉండగా.. తొలిసారిగా రైతు ఆత్మహత్యల గురించి విన్నాను. పంట వేయడం కోసం కొన్ని వేలరూపాయలు రుణం తీసుకొని.. అదే రుణాన్ని చెల్లించే అవకాశం లేనప్పుడు రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఆ సమయంలో వెంటనే రుణాలు తీర్చలేకపోయిన 50 మంది రైతుల జాబితా తెప్పించి వెంటనే వారి రుణాలన్నీ తీర్చేశాను. ఈమధ్యకాలంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి 200 మంది రైతుల రుణాలు తీర్చాను" అని ఆయన తెలిపారు. 

ఈ రుణాలు తీర్చడం కోసం అమితాబ్ తన టీమ్‌తో మాట్లాడి తమ వద్ద ఉన్న జాబితా ప్రకారం 112 డిమాండ్ డ్రాఫ్టులు తయారుచేయమని తెలిపారట. ఆ డ్రాఫ్టులను రైతు కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా అందిస్తామని ఆయన అన్నారు. "వారి రుణాలు రూ.15 వేల రూపాయల నుండి రూ.30 వేల రూపాయల మధ్యలో ఉంటాయి. అయినా సరే.. పంటలు పండకపోవడంతో ఆ కొద్ది మొత్తాన్ని కూడా వారు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడం నన్ను ఎంతగానో కలచివేసింది. అందుకే వారి రుణాలన్నీ తీర్చాలని నేను నిర్ణయించుకున్నాను" అని అమితాబ్ తెలిపారు. 

Trending News