'కాలా' సినిమాకు కర్ణాటక కష్టాలు !

                                        

Last Updated : Jun 7, 2018, 12:18 PM IST
 'కాలా' సినిమాకు కర్ణాటక కష్టాలు !

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. లీగల్ గా చిత్రం విడుదలకు లైన్ క్లియర్ అయినప్పటికీ కర్నాటకలో పలు ఆటంకాలు ఎదురౌతున్నాయి. చిత్రం విడుదల చేయకూడదని పలు ప్రజా  సంఘాలు థియేటర్ల వద్ద భారీ సంఖ్యలో చేరుకొని అడ్డకుంటున్నారు. ఈ సినిమా ప్రదర్శిస్తే ఊరుకోమని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పలు ధియేటర్లలో చిత్ర ప్రదర్శన పూర్తిగా నిలిపివేశారు. పోలీసు బందోబస్తుతో కొన్ని ధియేటర్లలో  ప్రదర్శిస్తున్నప్పటికీ నామామాత్రంగా జనాలు సినిమా చూస్తున్నారు. 

కావేరీ జలాల పంపిణీ విషయంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మనస్పర్థలు ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో కర్నాటకలో తమిళనాడుకు చెందిన చిత్రాలను ప్రదర్శించకూడదని  ప్రజా సంఘాలు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నాయి.  కాలా సినిమా విషయంలో హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే సినిమా విడుదలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలతో భద్రత నడుమ చిత్ర ప్రదర్శన చేస్తున్నారు. థియేటర్ల వద్ద ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ 'కాలా' సినిమాకు కష్టాలు తప్పట్లేదు.

Trending News