చిరంజీవి నటిస్తున్న సైరా నర్సింహా రెడ్డి సినిమాకు పనిచేస్తోన్న ఓ రష్యన్ వడదెబ్బతో మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. టైమ్స్నౌన్యూస్.కామ్ వెల్లడించిన ఓ కథనం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం గచ్చిబౌళి డీఎల్ఎఫ్ బిల్డింగ్ వద్ద స్పృహకోల్పోయి పడి వున్న అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించేటప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడని తెలుస్తోంది. ఆ సమయంలో సదరు వ్యక్తి వద్ద పాస్ పోర్ట్ లేకపోవడంతో అతడు ఎవరో ఏంటో గుర్తుపట్టడం కష్టంగానే అనిపించినప్పటికీ.. అతడి కెమెరాలో సైరా షూటింగ్‌కి సంబంధించిన స్టిల్స్ ఉండటంతో సైరా యూనిట్ సభ్యులను ఆరాతీయగా అతడు రష్యాకు చెందిన అలెగ్జాండర్ అని తేలింది.
ఏప్రిల్‌లో టూరిస్ట్ వీసాపై గోవాలోని తన స్నేహితుడి వద్దకు వచ్చిన అలెగ్జాండర్‌ను ముంబైలోని కొంతమంది ఫిలిం ఏజెంట్స్.. అతడిని హైదరాబాద్‌లో సైరా సినిమాకు పనిచేయాల్సిందిగా పంపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
సైరా షూటింగ్‌కి పనిచేస్తోన్న రష్యన్ మృతి!