తేజ మరో అద్భుతమైన లవ్ స్టోరీ, అదేంటంటే...

అద్భుతమైన ప్రేమ చిత్రాలు నిర్మించిన దర్శకుడు తేజ, మళ్ళీ పాత ట్రాక్ ఎక్కబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.  తన మొదటి చిత్రం నుంచి ప్రేమకథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తేజ, 

Last Updated : Feb 22, 2020, 06:21 PM IST
తేజ మరో అద్భుతమైన లవ్ స్టోరీ, అదేంటంటే...

హైదరాబాద్: అద్భుతమైన ప్రేమ చిత్రాలు నిర్మించిన దర్శకుడు తేజ, మళ్ళీ పాత ట్రాక్ ఎక్కబోతున్నాడా? అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు.  తన మొదటి చిత్రం నుంచి ప్రేమకథా చిత్రాలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చిన తేజ, ఆ తరువాత విభిన్నమైన కథలను తెరపై ఆవిష్కరించాడు. విజయాలను స్వీకరిస్తూ .. అపజయాలను అంగీకరిస్తూ అయన తన కెరియర్ ను కొనసాగిస్తూ వచ్చాడు. ఆ మధ్య ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సీత'  చిత్రం ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేకపోయింది.

ఇదిలా ఉండగా డైరెక్టర్ తేజ, ప్రస్తుతం రెండు కథలపై కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయిగానీ, వాటిపై స్పష్టత రాలేదు. నేడు తేజ పుట్టినరోజు, కాగా  ఈ సందర్భంగా ఆయన తన తదుపరి సినిమాలకి సంబంధించి రెండు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాడు. ఒక టైటిల్ 'అలివేలుమంగ - వెంకటరమణ' అయితే, మరో టైటిల్ 'రాక్షస రాజు రావణాసురుడు' ఈ రెండింటిలో ఒక సినిమాలో రానా .. మరో సినిమాలో గోపీచంద్ నటించనున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించిన మిగతా వివరాలను ఆయన త్వరలో తెలియజేయనున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News