ఐపీఎల్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే..!

ఐపీఎల్ 2018 వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రైజ్ మనీ వివరాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Last Updated : Mar 27, 2018, 07:59 PM IST
ఐపీఎల్ ప్రైజ్ మనీ వివరాలు ఇవే..!

ఐపీఎల్ 2018 వచ్చేస్తోంది. ఈ క్రమంలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ప్రైజ్ మనీ వివరాలపై కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఈ ప్రైజ్ మనీ చాలా తక్కువ కావడం గమనార్హం. ఫిఫా, వింబుల్డన్ లాంటి టోర్నమెంట్లతో పోల్చుకుంటే ఐపీఎల్ ద్వారా ఆటగాళ్ళకు లభించేది మాత్రం చాలా తక్కువే అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐపీఎల్‌లో విజేత జట్టుకిచ్చే మొత్తం ఎంతో తెలుసా.. అక్షరాలా రూ.56 కోట్లు. అందులో విన్నర్‌కి రూ.26 కోట్లు ఇస్తే.. రన్నరప్‌కి రూ.13 కోట్లు ఆఫర్ చేస్తున్నారు. అంటే జట్టులో ఒక్కో ఆటగాడికి, సభ్యుడికి ఎంత లభిస్తుందో మనం ఇట్టే చెప్పేవచ్చు.  అయితే ఐపీఎల్‌తో పోల్చుకుంటే ఫిఫా ప్రైజ్ మనీ చాలా రెట్లు ఎక్కువ. ఆ మొత్తం ఇండియన్ కరెన్సీలో రెండు బిలియన్ల రూపాయలకు పైగానే ఉంటుంది. 

Trending News