మనసులోని మాట చెప్పిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'.

Updated: Apr 15, 2018, 05:35 PM IST
మనసులోని మాట చెప్పిన మహేశ్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం 'భరత్ అనే నేను'. ఈ చిత్రం ఏప్రిల్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. తాజాగా మహేశ్ బాబు మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆంగ్ల వార్తాపత్రికలతో మాట్లాడారు. ఈ చిత్రం తన కెరీర్‌లో భారీ విజయం సాధిస్తుందని చెప్పారు. అలానే ఈ సినిమాలో తన నటన ఇప్పటి వరకు తను నటించిన సినిమాల్లో కన్నా వైవిధ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అలానే తన కెరియర్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  

మిమ్మల్ని దర్శకుడిగా చూడొచ్చా? అని అడిగిన ప్రశ్న అడిగినప్పుడు సమాధానంగా ఇప్పట్లో చూడకపోవచ్చు. ప్రస్తుతం నేను యాక్టింగ్‌ బాగా ఎంజాయ్ చేస్తున్నా... ఒకవేళ దర్శకుడిగా రావడం అంటూ జరిగితే చాలా రోజుల తరువాత జరుగుతుంది అని అన్నారు. ఈ మాటల బట్టి చూస్తే మహేశ్‌ని భవిష్యత్తులో దర్శకుడిగా చూడొచ్చన్నమాట. ఇప్పటికే మహేశ్ కుటుంబం నుంచి సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని దర్శకులుగా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి.

'భరత్ అనే నేను' చిత్రంలో మహేష్ సీఎం పాత్రలో కనిపించనున్నాడు. టీజర్, ట్రైలర్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రావడంతో సినిమా భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని అభిమానులు అంటున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.