close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

నాని నటించిన గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ ఇదే

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ సినిమా గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.

Updated: Jul 15, 2019, 06:25 PM IST
నాని నటించిన గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ ఇదే

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న అప్ కమింగ్ సినిమా గ్యాంగ్ లీడర్ ఫస్ట్ లుక్ వచ్చేసింది. ఒక చిన్న పాప, ఓ టీనేజ్ అమ్మాయి, మరో యువతి, ఇంకో నడి వయస్సు మహిళ, మరో వృద్ధురాలు నాని వెనకాలే బైనాకులర్స్ పట్టుకుని నిలబడటం ఈ ఫస్ట్ లుక్ ప్రత్యేకత కలిగి ఉండేలా డిజైన్ తీర్చిదిద్దారు. విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మిస్తున్నారు. ఆగస్టు 30న విడుదల కానున్న ఈ సినిమాలో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ విలన్ పాత్ర పోషిస్తున్నాడు.

గ్యాంగ్ లీడర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జూలై 18న సినిమాలోంచి మొదటి పాటను విడుదల చేసి, జూలై 24న టీజర్ విడుదల చేసేందుకు యూనిట్ ఏర్పాట్లు చేసుకుంటోంది. నానితోపాటు ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, జైజా, సత్య తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.