సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్‌మెంట్

Sujeeth Engagement PhotoS | టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ త్వరలో ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రేయసితో సాహో డైరెక్టర్ సుజీత్ నిశ్చితార్థం చాలా సింపుల్‌గా నిర్వహించారు.

Last Updated : Jun 11, 2020, 02:47 PM IST
సాహో డైరెక్టర్ సుజీత్ ఎంగేజ్‌మెంట్

Sujeeth Engaged To pravalika: టాలీవుడ్ సెలబ్రిటీలకు లాక్‌డౌన్ సమయాన్ని వ్యక్తిగత జీవితానికి కేటాయిస్తున్నారు. ఇటీవల కొందరు టాలీవుడ్ ప్రముఖులు వివాహం, నిశ్చితార్థాలు చేసుకోగా, తాజాగా సాహో డైరెక్టర్ సుజీత్ వంతు వచ్చింది. యంగ్ డైరెక్టర్ సుజీత్ (Director Sujeeth) జూన్ 10న ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. సుజీత్, ప్రవళికల నిశ్చితార్థ వేడుక చాలా సింపుల్‌గా జరిగింది.  బాలీవుడ్ నటి టాప్ 10 Bikini Photos

ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబాల సభ్యులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. సుజీత్ నిశ్చితార్థం (Sujeeth Engagement) ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలోనే పెళ్లికి ముహూర్తం ఖరారు చేసుకోకున్నారని తెలుస్తోంది. డెంటిస్ట్ అయిన ప్రవళిక, సుజీత్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలకు చెప్పి తమ ప్రేమను గెలిపించుకున్నారు. ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనుంది.  బాలకృష్ణ బర్త్‌డే సెలబ్రేషన్.. ఫొటో గ్యాలరీ

కాగా, టాలీవుడ్‌లో ఇటీవల నిర్మాత దిల్ రాజు, హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ వరుసగా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కారు. దగ్గుబాటి రానా, మిహికా బజాజ్‌ల రోకా వేడుక జరిగింది. ఈ క్రమంలో టాలీవుడ్‌ యంగ్ టాలెంటెడ్ దర్శకుడు సుజీత్  (Sujeeth) త్వరలో పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. లాక్‌డౌన్ కారణంగా నితిన్ తన వివాహాన్ని వాయిదా వేసుకున్నాడని తెలిసిందే. (Image Creit:Twitter/@UrsVamsiShekar)  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్

Trending News