సినీనటుడు సుభాష్ చంద్ర బోస్ మృతి

సినీనటుడు సుభాష్ చంద్ర బోస్ కన్నుమూత

Last Updated : Apr 28, 2019, 07:04 PM IST
సినీనటుడు సుభాష్ చంద్ర బోస్ మృతి

హైదరాబాద్: సినిమాలతోపాటు పలు టీవీ సీరియల్స్‌లో నటించి నటుడిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సుభాష్‌ చంద్ర బోస్‌ అలియాస్‌ బోస్‌ ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటూ సినిమాలు, సీరియల్స్‌లో పలు సైడ్ క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటున్న సుభాష్‌చంద్రబోస్‌ ఈ నెల 24న ప్రమాదవశాత్తు కిందపడ్డారు. తలకి బలమైన గాయం కావడంతో తలలో రక్తం గడ్డకట్టింది. బోస్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోపోవడంతో కుటుంబసభ్యులు అతడిని సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఇవాళ తుది శ్వాస విడిచారు. 
 
'సాహసపుత్రుడు' అనే సినిమాతో నటుడిగా పరిచయమైన బోస్ ఆ తర్వాత చిరంజీవి కొదమసింహం, గులాబీ, డేంజర్, అల్లరి రాముడు, కొంచెం ఇష్టం.. కొచ్చెం కష్టం, నిన్నే పెళ్లాడుతా, ఈడియట్‌, శివమణి, ప్రేమించి చూడు, ప్రేమఖైదీ వంటి చిత్రాల్లో నటించారు. బోస్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం ప్రకటించారు.

Trending News