Actor Uttej-Garikapati-Chiranjeevi : చిరుపై గరికపాటి సీరియస్.. 'ఉత్తేజ్'పరిచే పోస్ట్.. అసలు సిసలు మెగా అభిమాని

Actor Uttej on Garikapati Narasimha rao మెగాస్టార్ చిరంజీవి మీద అవనసరంగా నోరు జారితే.. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు సంధిస్తారో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. అయితే గరికపాటి చిరు మీద కస్సుబుస్సులాడటంపై తాజాగా మెగా అభిమాని ఉత్తేజ్ సుధీర్ఘ పోస్ట్ వేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 7, 2022, 04:33 PM IST
  • అలయ్ బలయ్ కార్యక్రమంలో వివాదం
  • చిరంజీవి మీద గరికపాటి సీరియస్
  • నటుడు ఉత్తేజ్ సుధీర్ఘ పోస్ట్
Actor Uttej-Garikapati-Chiranjeevi : చిరుపై గరికపాటి సీరియస్.. 'ఉత్తేజ్'పరిచే పోస్ట్.. అసలు సిసలు మెగా అభిమాని

Actor Uttej-Garikapati-Chiranjeevi : అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి మీద గరికపాటి సీరియస్ అయిన ఘటన ఇప్పుడు ఎంతగా చర్చకు దారి తీసిందో అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా గరికపాటి మీద నాగబాబు సెటైర్లు వేయడం, మెగా ఫ్యాన్స్ సైతం తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేయడం జరుగుతోంది. ఓ వర్గం గరికపాటిని తప్పుబడుతోంది. ఇంకో వర్గం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. అయితే చిరంజీవి స్పందించిన తీరు, ఆ హుందాతనానికి అందరూ చేతులెత్తి మొక్కేస్తున్నారు. గరికపాటి సీరియస్ అయినా కూడా చిరంజీవి మాత్రం నవ్వుతూ, ప్రేమగా మాట్లాడాడు.

తాజాగా చిరంజీవి గొప్పదనాన్ని అభివర్ణిస్తూ మెగా అభిమాని అయిన ఉత్తేజ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఫేస్ బుక్‌లో ఉత్తేజ్ షేర్ చేసిన ఈ పోస్ట్.. యథాతథంగా మీకోసం.. 'అరె అరె అరే!! చాలా బాధేసింది గరికపాటి గారూ.... చిరంజీవి అన్నయ్య గురించి అలా మాట్లాడకుండా ఉండాల్సింది.. మీరు చెప్పే ప్రవచనాలు రోజూ 106.లో 6am to 7am వరకూ వింటూ ఉంటాము. మా ఇంట్లో 24 గంటలు రేడియో మోగుతూనే ఉంటుంది. ఇవుడిపుడే, మా జనరేషన్కి మీమీద  ఓ అభిప్రాయం, ఏర్పడి, ఓ గౌరవం తొంగిచూస్తోంది.  సరిగ్గా ఇలాంటి టైంలో, శిఖరాగ్రప్రయాణంలో..ఇసుక వల్ల జారి పడ్డట్టుగా, చిన్న చిన్న  రాగ ద్వేషాలని ఈర్ష్యా అసూయలని జయించలేక..2 నిముషాల సంయమనం లేకపోవడం వల్లో, ...ఏదైతేనేం జారిపడ్డారు... "చిరంజీవి గారు దయచేసి ఫోటో సెషన్ ఆపండి లేదంటే వెళ్లిపోతాను, సెలవిప్పించండి. "అంటూ... అయ్యో !! గరికపాటి గారూ..,

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News