Pushpa 2 Update: 'పార్టీ లేదా షెకావత్'-'పుష్ప 2' నుంచి షెకావత్ లుక్ రిలీజ్

పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన పుష్ప దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే! దీంతో పార్టీ-2 సినిమాపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఫహద్ ఫజిల్ పుట్టిన రోజు సందర్భంగా పుష్ప-2 లోని ఒక లుక్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2023, 06:07 PM IST
Pushpa 2 Update: 'పార్టీ లేదా షెకావత్'-'పుష్ప 2' నుంచి షెకావత్ లుక్ రిలీజ్

Pushpa 2 Update: ఐకాన్ స్టార్‌‌ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాలో "పార్టీ లేదా పుష్ప" అంటూ తన విలనిజాన్ని పండించాడు మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్. సినిమాలో కనిపించేది కొద్దిసేపైనా తన డైలాగులతో ప్రేకులకు దగ్గరయ్యాడు.

'పుష్ప2' లో హీరోను ఢీకొట్టే ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. నేడు ఫహద్ ఫజిల్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ బర్త్ డే విసెస్ చెబుతూ.. ఫహద్ ఫజిల్ లుక్ ను రిలీజ్ చేసింది. షెకావత్ లుక్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. 

పార్టీ లేదా షెకావత్ అంటూ..
కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని, సిగరెటు తాగుతూ, గుండుపై గాయం గుర్తుతో, మెడలో తాయత్తు ధరించి కోపంతో క్రూరంగా కనిపిస్తున్నాడు. 'భన్వర్ సింగ్ షెకావత్ సర్.. ప్రతీకారంతో వస్తున్నారు' అంటూ ఫహద్ ఫజిల్ లుక్ కు అదిరిపోయే విధంగా చిత్ర యూనిట్ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నిన్నటిదాకా 'అప్‌డేట్ లేదా పుష్ప' అంటూ అడిగిన అభిమానులు.. ఇప్పుడు 'పార్టీ లేదా షెకావత్' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

Also Read: Ambareesh Murty: గుండెపోటుతో ప్రముఖ వ్యాపారవేత్త అంబరీష్ మూర్తి కన్నుమూత

దీంతో పుప్ప 2 ది రూల్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. కాగా, సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. పుష్ప2లో షెకావత్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని, హీరోకు, ఆ పాత్రకు యాక్షన్ సీన్స్ ఉంటాయని ఇటీవల ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చాడు. షెకావత్ పాత్రకు సంబంధించిన ఇప్పటికే ఫాజిల్ షూటింగ్ మొత్తం పూర్తయినట్లు సమాచారం. 

Also Read: Poco F5 5G Price: డెడ్‌ ఛీప్‌గా 5G స్మార్ట్ ఫోన్‌ కొనాలనుకుంటున్నారా?  POCO F5 5G రూ. 1,600లకే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

 

 

 

Trending News