Yamadheera Review: పొలిటికల్ డ్రామా 'యమధీర' మెప్పించిందా..? క్రికెటర్ శ్రీశాంత్ యాక్టింగ్ ఎలా ఉందంటే..!

Yamadheera Movie Review and Rating: పొలిటికల్ డ్రామా, ఈవీఎంల ట్యాంపరింగ్ స్టోరీ బేస్‌గా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన మూవీ యమధీర. ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. క్రికెటర్ శ్రీశాతం కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 23, 2024, 05:30 PM IST
Yamadheera Review: పొలిటికల్ డ్రామా 'యమధీర' మెప్పించిందా..? క్రికెటర్ శ్రీశాంత్ యాక్టింగ్ ఎలా ఉందంటే..!

Yamadheera Movie Review and Rating: తారాగణం: కోమల్ కుమార్, శ్రీశాంత్ (క్రికెటర్), రిషీక శర్మ, నాగబాబు, ఆలీ, సత్య ప్రకాష్, మధు సూదన్, తదితరులు. 

టెక్నికల్ టీమ్:
==> ప్రొడక్షన్: శ్రీ మందిరం ప్రొడక్షన్స్
==> కెమెరామెన్ : రోష్ మోహన్ కార్తీక్ 
==> డైలాగ్స్, సాంగ్స్: వరదరాజ్ చిక్కబళ్ళపుర
==> ఎడిటింగ్: సి రవిచంద్రన్ 
==> మ్యూజిక్: వరుణ్ ఉన్ని
==> ప్రొడ్యూసర్: వేదాల శ్రీనివాస్ రావు
==> కథ, దర్శకత్వం: శంకర్ ఆర్
==> PRO: మధు VR

కథ ఏంటంటే..?

కేపీ గౌతమ్ (కోమల్ కుమార్) సీన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒక సీన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా అన్యాయాన్ని ఎదుర్కొంటూ  ట్రాన్స్‌ఫర్లు అవుతూ.. వైజాగ్ కమిషనర్‌గా నియామకం అవుతాడు. అక్కడ ఒక యువకుడి మిస్టరీ డెత్ కేస్ రీఓపెన్ చేసి పరిష్కరించే క్రమంలో అజర్ బైజాన్ దేశంలో ఉన్న దేశముఖ్ (క్రికెటర్ శ్రీశాంత్) ఆ యువకుడిని చంపేశాడని తెలుసుకుంటాడు. అదేవిధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయించి దేశముఖ్‌ సీఎం అవుతాడు. తన పై అధికారి అయిన నాగబాబు సపోర్ట్‌తో ఆ కేసును గౌతమ్ సాల్వ్ చేశాడా లేదా..? దేశముఖ్‌కు ఆ యువకుడు హత్యకి సంబంధమేంటి..? సీఎం హోదాలో ఉన్న దేశముఖ్‌ను గౌతమ్ ఎలా ఎదుర్కొన్నాడు..? ఈ విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా చేశారంటే..?

హీరోగా కోమల్ కుమార్ నటన చాలా బాగుంది. అమ్మ సెంటిమెంట్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా చేశాడు. నెగిటివ్ రోల్‌లో క్రికెటర్ శ్రీకాంత్ చాలా బాగా నటించాడు. రిషిక శర్మ తన పరిధి మేరకు మంచి నటనను కనబరిచింది. మూగ వ్యక్తి పాత్రలో ఆలీ నటన.. ఆయన పండించిన కామెడీ చాలా అద్భుతంగా ఉంది. నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్, పృథ్వీరాజ్ ఎవరు పరిధికి వారు బాగా నటించారు.

మూవీ కన్నడ మాతృక అయినా అచ్చ తెలుగు సినిమా లాగా చిత్రీకరించారు. శ్రీ మందిరం ప్రొడక్షన్స్‌పై వేదాల శ్రీనివాసరావు నిర్మాతగా ఈ సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చారు. డీఓపీ రోష్ మోహన్ కార్తీక్ పనితీరు బాగుంది. వరుణ్ ఉన్ని అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి హైలైట్. శంకర్ ఆర్ ఎంచుకున్న కథ దర్శకత్వం చాలా బాగున్నాయి. వరదరాజ్ చిక్కబళ్ళపుర అందించిన డైలాగ్స్ చాలా పవర్ఫుల్‌గా ఉన్నాయి.

ప్లస్ పాయింట్స్ :

==> కోమల్ కుమార్, రిషిక శర్మ, నాగబాబు, మధుసూదన్ రావు, సత్య ప్రకాష్ నటన
==> నెగిటివ్‌ రోల్‌లో క్రికెటర్ శ్రీశాంత్ యాక్టింగ్
==> ఆలీ కామెడీ, ఆర్.శంకర్ కథ దర్శకత్వం
==> మదర్ సెంటిమెంట్, పొలిటికల్ డ్రామా

మైనస్ పాయింట్స్ :

==> అక్కడక్కడ ఉన్న లాగ్ సీన్స్
==> శ్రీశాంత్ పాత్ర నిడివి కొంచెం తక్కువ ఉండడం
==> సాంగ్స్

చివరగా.. ఎన్నికల సమయంలో ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి ప్రజలకు అవగాహన కలిగించే ఒక మంచి కమర్షియల్ ఎంటర్‌టైనర్ యమధీర.

రేటింగ్ : 2.75/5

 

Trending News