Post Office: వివాహితులకు శుభవార్త.. ఇలా చేస్తే ఏడాదికి రూ.59,400 ఆదాయం

Post Office Scheme: పోస్టాఫీసు సరికొత్త పథకం తీసుకువచ్చింది. ఈ కొత్త పథకంలో ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. వివాహితులైతే ఏడాదికి రూ.59,400 కూడా సంపాదివచ్చు. ఆ పథకం గురించి పూర్తి వివరాలు ఇలా..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2022, 08:45 PM IST
Post Office: వివాహితులకు శుభవార్త.. ఇలా చేస్తే ఏడాదికి రూ.59,400 ఆదాయం

Post Office Scheme: మీరు వివాహితులై..  మీరు ప్రతి నెలా సంపాదించడానికి సురక్షితమైన మార్గం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఓ సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇందులో భార్యాభర్తలిద్దరూ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ తీసుకువచ్చిన ఈ పథకంలో పెట్టుబడి పెడితే..  మీ డబ్బు భద్రంగా ఉండడంతోపాటు గ్యారెంటీ రిటర్న్స్ కూడా వస్తాయి. పూర్తి వివరాలు ఇవిగో..

పథకం పేరు ఏమిటి..?

ఈ పోస్టాఫీసు పథకం పేరు మంత్లీ సేవింగ్స్ స్కీమ్. ఇందులో మీరు ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. ఇందులో సింగిల్ అకౌంట్ కూడా ఓపెన్ చేయొచ్చు. పెళ్లయితే జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. 

ఏడాదికి రూ.59,400 

ఈ పథకంలో మీరు వివాహితులు జాయింట్ ఖాతాను తెరవవచ్చు. మీరు ఈ పథకంలో రూ.9 లక్షలు డిపాజిట్ చేయాలి. దానిపై మీరు 6.6 శాతం వడ్డీ ప్రయోజనం పొందుతారు. రూ.59,400 రూపాయల వార్షిక ఆదాయం రానుంది. అంటే నెల నెలకు రూ.4,950 మీ ఖాతాలో జమకానుంది.

లెక్కింపు ఇలా..

ఈ పథకం కింద మీరు మీ మొత్తం డిపాజిట్‌పై వార్షిక వడ్డీ ప్రయోజనాన్ని పొందుతారు. ఇందులో మీ మొత్తం రాబడిని వార్షిక ప్రాతిపదికన లెక్కిస్తారు. దానిని 12 భాగాలుగా విభజిస్తారు. అందులో కొంత భాగాన్ని మీరు ప్రతి నెలా మీ ఖాతాలోకి తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ప్రతి నెల అవసరం లేదనుకుంటే.. మీరు ఈ డబ్బు మొత్తాన్ని మెచ్యూరిటీపై మీ అసలు మొత్తంతో కలిపి తీసుకోవచ్చు.

Also Read: Pawan Kalyan: ఎన్నికల యుద్ధానికి పవన్ కళ్యాణ్ ప్రచార రథం సిద్ధం.. సరికొత్త పేరు పెట్టిన జనసేనాని

Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News