Weight Loss Diet: ఈ 5 రోటీలతో ఎంతటి బరువైనా 10 రోజుల్లో తగ్గడం ఖాయం..

5 Rotis For Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు ఈ కింది పిండిలతో తయారు చేసిన రోటీలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా శరీరంలోని కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 6, 2023, 05:30 PM IST
Weight Loss Diet: ఈ 5 రోటీలతో ఎంతటి బరువైనా 10 రోజుల్లో తగ్గడం ఖాయం..

 

5 Rotis For Weight Loss: ప్రతి రోజు రోటీలు తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అధిక బరువు సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు రోటీలను తినడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని కోసమని చాలా మంది గోధుమ, మైదా పిండితో తయారు చేసిన రోటీలను అతిగా తీసుకుంటూ ఉంటున్నారు. వాటికి బదులుగా చిరుధాన్యాలతో తయారు చేసిన రోటీలు తీసుకోవడం వల్ల సులభంగా ఊబకాయం నుంచి ఉపశమనం పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గడానికి ఏయే పిండితో తయారు చేసిన రోటీలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునేవారు బార్లీ పిండితో తయారు చేసిన రోటీలు తీసుకోవడం వల్ల సులభంగా మంచి ఫలితాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌ పరిమాణాలు సులభంగా ఊబకాయం సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా శరాన్ని రక్షిస్తాయి. 

మొక్కజొన్న రొట్టెలు కూడా వేళాడుతున్న పొట్టను తగ్గించేందుకు కూడా సహాయపడతాయి. ఇందులో ఉండే శరీరానికి కావాల్సిన బోలెడు పోషకాలు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు డైట్‌లో భాగంగా మొక్కజొన్న రోటీలను తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు ఆకలిని కూడా నియంత్రిస్తాయి. 

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

రాగి పిండితో తయారు చేసిన రోటీలు కూడా శరీర బరువును తగ్గించేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీరాన్ని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడతాయి. దీంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి మైదా పిండి రోటీలకు బదులుగా రాగి రోటీలు తీసుకోవాల్సి ఉంటుంది.

చిరుధాన్యాలతో తయారు చేసిన రోటీలను శరీరానికి ఎంతో శక్తిని అందజేస్తాయి. అంతేకాకుండా ఇందులో పోషకాల పరిమాణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రతి రోజు చిరుధాన్యాలతో చేసిన రోటీలను తీసుకోవడం వల్ల సులభంగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుంగా ఉంటారు. 

సోయాబీన్స్‌తో కూడా కొన్ని రాష్ట్రాల ప్రజలు రోటీలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారు వీటిని కూడా డైట్‌లో చేర్చుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోటీల్లో ఉండే ఫైబర్‌ శరీర బరువును తగ్గించడమే కాకుండా కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు కూడా సహాయపడుతుంది.  

ఇది కూడా చదవండి : Chandrayaan 3: చంద్రయాన్ 3 మిషన్ జీవితకాలం మరో 7 రోజులేనా, తరువాత ఏంటి పరిస్థితి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News