అన్ని చక్కెరలు ఒకేలా ఉండవు

చక్కెరలన్నీ ఒకేలా ఉండవు. కొన్ని రకాల చక్కెర మధుమేహం, గాయాలను నయం చేస్తుంది.

Last Updated : Nov 17, 2017, 11:14 AM IST
    • చక్కరతో గాయాలు మాయం
    • మధుమేహ వ్యాధి గ్రస్తులు కూడా తినవచ్చు
అన్ని చక్కెరలు ఒకేలా ఉండవు

చెక్కరలన్నీ ఒకేలా ఉండవని యూకే కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్, పాకిస్థాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తేల్చారు. కొన్ని రకాల చెక్కర గాయాలు మాన్పడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అన్ని చక్కెరలు శరీరానికి హానికరం కావు అని తమ పరిశోధనలో తెలిసిందని అన్నారు. మధుమేహం, వయసు రీత్యా తగ్గని గాయాలు మాన్పడంలో కొన్ని రకాల చెక్కరలు ఉపయోగపడతాయి. శరీరంలో కొత్త రక్తనాళాలు ఏర్పడటంతో కొన్ని రకాల చక్కెర సాయపడతాయి అని వారు వెల్లడించారు.

చక్కర అంటే మనకు తెలిసింది పంచదార. కానీ మాడ్రన్ కెమిస్ట్రీ లో చెక్కర ఒక రకం మాత్రమే. వారి మాటల్లో పంచదార ఒక రకం చక్కెర అన్నమాట. నాలుకకు తీపినిచ్చేది మరొక రకం చక్కెర. గ్లూకోజు బిస్కట్లలో ఉండే తీపి మరొక రకం చక్కెర. తేనెలో ఉన్నది ఇంకో రకం చక్కర అన్నారు. సైన్సు దృష్టిలో “చక్కెర” అన్న పదం ఒక జాతిని చెబుతుంది.

Trending News