Tips to Beat Sunstroke: వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించే ఐదు అద్బుత పానీయాలు

Tips to Beat Sunstroke: వేసవి ప్రారంభమైపోయింది. ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత ఏడాది ఎండల తీవ్రత అత్యధికంగా 50 డిగ్రీలు నమోదైంది. ఈ ఏడాది కూడా వేసవి తీవ్రంగా ఉండబోతుందనే హెచ్చరికలు వస్తున్నాయి. ఈ క్రమంలో వడదెబ్బ నుంచి రక్షించుకునే చిట్కాల గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 9, 2024, 07:49 PM IST
Tips to Beat Sunstroke: వేసవిలో వడదెబ్బ నుంచి రక్షించే ఐదు అద్బుత పానీయాలు

Tips to Beat Sunstroke: తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రత కొన్ని ప్రాంతాల్లో 41 డిగ్రీలకు చేరుకుంటోంది. ఏప్రిల్ , మే నెలల్లో ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసింది. వడగాల్పుల ముప్పు ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆరోగ్యానికి మేలు చేకూర్చే చల్లని పానీయాలు ఏమున్నాయో పరిశీలిద్దాం.

ఈ వేసవి తీవ్రంగా ఉంటుందనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదముంది. అందుకే సాధ్యమైనంతవరకూ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు ప్రయత్నించాలి. ఎక్కువ నీళ్లు తాగాల్సి ఉంటుంది. వాటర్ కంటెంట్ అధికంగా ఉండే ఫ్రూట్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అందుకే వైద్య నిపుణులు ఈ ఐదు రకాల పానీయాలు ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా, ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనం కలుగుతుంది. 

పుచ్చకాయ

పుచ్చకాయ అనేది వేసవిలో అద్భుతమైన ఫ్రూట్. ఇందులో 90 శాతం నీళ్లే ఉంటాయి. దీనికితోడు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, బి6, విటమిన్ సి, పొటాషియం, ఎమైనో ఆసిడ్స్ వంటివి శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ప్రయత్నిస్తాయి. 

కొబ్బరి నీళ్లు

ఇక కొబ్బరి నీళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శరీరాన్ని ఎనర్జిటిక్‌గా మార్చేందుకు, హైడ్రేట్‌గా ఉంచేందుకు కొబ్బరి నీళ్లకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. వేసవి వడగాల్పుల్ని ఎదుర్కొనేందుకు కొబ్బరి నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. నీరసం, బలహీనత తగ్గుతాయి.

బటర్ మిల్క్

మజ్జిగ ఆరోగ్యానికి అద్బుతమైన ఔషధంలా పనిచేస్తుంది. ముఖ్యంగా వేసవి కాలంలో శరీరానికి చాలా చాలా మంచిది. మజ్జిగ తాగడం వల్ల శరీరానికి చలవ చేస్తుంది. మెటబోలిజం వేగవంతమౌతుంది. గట్ సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే ప్రో బయోటిక్స్, విటమిన్లు, మినరల్స్ శరీరాన్ని సాధారణ ఉష్ణోగ్రత ఉండేలా చేస్తాయి.

దోసకాయ, కీరా

దోసకాయ రకాలు ఏవైనా సరే వేసవిలో ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దాంతోపాటు విటమిన్ బి1, బి2, బి3, బి5, బి, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్ ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. ఈ పోషకాల వల్ల మలబద్ధకం సమస్య పోతుంది. శరీరంలో విష పదార్ధాలు తొలగిపోతాయి. శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. 

సిట్రస్ ఫ్రూట్స్

వేసవిలో సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆరెంజ్, లెమన్ అనేవి తప్పకుండా తీసుకోవాలి. వీటిలో పుష్కలంగా నీటితో పాటు విటమిన్ సి ఎక్కువ మోతాదులో ఉంటుంది. చర్మ సమస్యలు కూడా తలెత్తవు. 

Also read: Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? అయితే మహిళలు జాగ్రత్త..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News