Danger Diseases: కొంతమందికి తరచూ వాంతులవుతుంటాయి. చాలామంది తేలిగ్గా తీసుకుంటుంటారు. కానీ ఇది మంచిది కాదు. ప్రాణాంతక వ్యాధులకు కారణం కావచ్చు. తరచూ వాంతులు రావడం మంచి సంకేతం కానే కాదనేది గుర్తుంచుకోవాలి.
శరీరంలో ఏ చిన్న సమస్య తలెత్తినా లేదా మార్పు వచ్చినా ఏదో రూపంలో బయటకు కన్పిస్తుంటుంది. కానీ మనమే ఆ సంకేతాల్ని సరిగ్గా గుర్తించలేకపోతుంటాం. ముఖ్యంగా వాంతులు రావడం లేదా వాంతుల వచ్చే ఫీలింగ్ అంటే వికారంగా ఉండటం తరచూ చూస్తుంటాం. చాలామంది ఈ లక్షణాన్ని తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఇది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే ప్రాణాంతక వ్యాధుల లక్షణం కూడా కావచ్చు. అందుకే మీకెప్పుడైనా తరచూ వాంతులు రావడం లేదా వికారంగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది.
5 ప్రధాన వ్యాధులు-వాంతి లక్షణాలు
లివర్ సమస్యలు. లివర్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన అంగం. శరీరంలోని విష పదార్ధాలను బయటకు తొలగించడంలో దోహదం చేస్తుంది. లివర్ పనితీరు సరిగ్గా లేకుంటే వాంతులు, వికారం, కడుపు నొప్పి, చర్మం-కళ్లు పసుపుగా మారడం వంటివి కన్పిస్తాయి.
గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్. గ్యాస్ట్రో సమస్యలుంటే వాంతులు, వికారం, కడుపు నొప్పి, బరువు తగ్గడం జరుగుతుంది. గ్యాస్ట్రో ఎంటిరైటిస్, కొలైటిస్, క్రోహెన్ వంటి సమస్యలుంటే ఈ లక్షణాలే కన్పిస్తాయి.
హార్ట్ ఎటాక్. గుండె వ్యాధులుంటే గుండె కండరాలకు తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా కాదు. దాంతో ఛాతీలో నొప్పి, శ్వాత తీసుకోవడంలో ఇబ్బంది, వాంతులు, వికారం వంటి సమస్యలు కన్పిస్తాయి. మీకెప్పుడైనా ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయకుండా తక్షణం వైద్యుని సంప్రదించాలి.
కిడ్నీ వ్యాధులు
కిడ్నీల్లో సమస్య ఉంటే శరీరంలోని విష పదార్ధాలు, వ్యర్ధ పదార్ధాలు బయటకు తొలగించడంలో అంతరాయం ఏర్పడుతుంది. దాంతో రక్తంలో ఇవన్నీ పేరుకుంటాయి. ఫలితంగా వాంతులు, వికారం వంటి సమస్యలు తలెత్తుతాయి.
మెదడులో ట్యూమర్ లేదా కేన్సర్. ఇది అత్యంత ప్రమాదకరమైంది. మెదడులో కేన్సర్ సోకితే లేదా కేన్సర్ ట్యూమర్ ఏర్పడినప్పుడు కూడా తరచూ వాంతులు, వికారం లక్షణాలతో పాటు తలనొప్పి, ఎటాక్స్ వంటివి కన్పిస్తాయి.
వాంతులకు ఇతర కారణాలేంటి
గర్భిణి మహిళలకు కూడా తరచూ వాంతులు, వికారం లక్షణాలు ఉంటాయి. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా వాటి దుష్పరిణామాలు కన్పిస్తాయి. కలుషిత భోజనం, లేదా నీళ్లు తాగినప్పుడు ఫుజ్ పాయిజన్ జరిగి వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి సంభవిస్తాయి. ఇంకొంతమందికైతే ప్రయాణాలు చేసేటప్పుడు మోషన్ సిక్‌నెస్ ఉంటుంది. దాంతో వాంతులు, వికారం, తల తిరగడం ఉంటుంది. ఏదైనా సరే తరచూ వాంతులవుతుంటే మాత్రం తక్షణం వైద్యుని సంప్రదించాలి. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్ధాలు తీసుకోవాలి. అది కూడా చిన్న చిన్న మొత్తంలో ఎక్కువసార్లు తీసుకోవాలి.
Also read: High Cholesterol: రక్త నాళాల్లో పేరుకుపోయే కొలెస్ట్రాల్ క్లీన్ చేసే 5 అద్భుతమైన ఫుడ్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook