Diabetes Risk: సాధారణంగా డయాబెటిస్ అనేది స్వీట్స్ అతిగా తినడం వల్ల వస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ ఇది పూర్తిగా వాస్తవం కాదు. లాన్సెట్ నివేదికల ప్రకారం నాన్ వెజ్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఓ రకం నాన్ వెజ్‌కు దూరంగా ఉండాలంటున్నారు.
మధుమేహం అనేది ఓ లైఫ్‌స్టైల్ డిసీజ్. కేవలం మన ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా వస్తుంటుంది. అందుకే ఈ వ్యాధికి నియంత్రణే తప్ప పూర్తి చికిత్స లేదు. అదే ఆహారపు అలవాట్లు, జీవనశైలిని నియంత్రించగలిగితే అంటే మార్చగలిగితే డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్నాయి. నాన్ వెజ్ ప్రియులయి ఉంటే మధుమేహం ముప్పు ఎక్కువగా ఉన్నట్టే. నైరుతి ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో 19 లక్షలకు పైగా అధిక వయస్సు కలిగిన వ్యక్తుల్ని అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకర అంశాలు వెలుగుచూశాయి. ఈ అధ్యయనం ప్రకారం రెడ్ మీట్ తినేవారిలో టైప్ 2 డయాబెటిస్ ముప్పు అధికంగా ఉందని తేలింది.
ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ మేగజీన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం రోజుకు 50 గ్రాముల ప్రోసెస్డ్ మీట్, 100 గ్రాముల అన్‌ప్రోసెస్డ్ రెడ్ మీట్, 100 గ్రాముల పౌల్ట్రీ మీట్ తీసుకున్నవారిపై అధ్యయనం చేశారు. ఈ క్రమంలో రోజుకు 50 గ్రాముల ప్రోసెస్డ్ మీట్ తిన్నవారిలో 15 శాతం, 100 గ్రాముల అన్‌ప్రోసెస్డ్ రెడ్ మీట్ తిన్నవారిలో 10 శాతం, 100 గ్రాముల పౌల్ట్రీ మీట్ తిన్నవారిలో 8 శాతం టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరిగింది.
అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో వంటి దేశాల పరిశోధకులతో అంతర్జాతీయ బృందం ఈ అధ్యయనం చేసింది. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో నిర్ణీత పరిమితి దాటి మీట్ తింటున్నట్టు గమనించారు. అందుకే టైప్ 2 డయాబెటిస్ ముప్పు పెరుగుతోంది. ఈ అధ్యయనంలో 31 గ్రూపులు ఉన్నాయి. రెడ్ మీట్ తిన్నవారిలో డయాబెటిస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.
Also read: Saffron Benefits: చిటికెడు చాలు ఒకటా రెండా 8 రోగాలకు పరిష్కారం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook