Pneumonia Precautions In Children: ప్రస్తుతం వాతావరణంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల దగ్గు, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూమోనియా వచ్చే ప్రమాదం ఉంది. ఈ న్యూమోనియా కారణంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టిప్స్‌ను పాటించడం వల్ల శీతాకాలంలో పిల్లలకు వచ్చే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
పరిశుభ్రత: మన అనారోగ్య సమస్య బారిన పడకుండా ఉండాలి అంటే మనం ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉండాలని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. చేతులను క్లీన్ ఉంచుకోవాలి. అలాగే తరుచుగా కళ్లు, నోటిని , ముక్కును తాకకుండా ఉండాలి. ఇలా చేయడం వల్ల వైరస్ శరీరంలోకి చేరకుండా ఉంటుంది.
ముందుగా రక్షణ: శీతాకాలంలో చాలా మంది దగ్గు, జలుబు సమస్యతో బాధపడుతుంటారు. ఈ లక్షణాలతో బాధపడుతున్నవారు తప్పకుండా వారి దగ్గర హ్యాండ్ శానిటైజర్, మాస్క్‌లను తీసుకోవాలి. దీని కారణంగా సమస్య మరింత పెద్దదిగా మారకుండా ఉంటుంది. ఇతరులకు సోకకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
Also read: Reuse Oil Side Effects: ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన నూనెను ఎన్నిసార్లు వినియోగించాలో తెలుసా?
రోగనిరోధక శక్తి: చలికాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దీని కారణంగా అనారోగ్య సమస్యల బారిన పడుతుంటాం. అయితే ఈ సమయంలో అరోగ్యం పెంచే ఆహారపదార్థాలు తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. ఆకుకూరలు వంటి రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు ఉండేలా చూసుకోవాలి.
వైద్యం: పిల్లల్లో జలుబు, దగ్గు ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. వారు చెప్పిన మందులను క్రమం తప్పకుండా వాడడం వల్ల సమస్య నుంచి బయటపడవచ్చు.
Also read :Kidney Failure Signs: మీ కిడ్నీలు బాగున్నాయో లేదో ఈ లక్షణాలను బట్టి చెప్పేయవచ్చు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter