Buttermilk: మనిషి శరీరంలో మూడు వంతులుండేది నీరే. అందుకే శరీరంలో ఎప్పటికప్పుడు నీటి కొరత లేకుండా చూసుకోవాలి. నీటి కొరత ఏర్పడితే..డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
సాధారణంగా డీహైడ్రేషన్ అంటే కేవలం వేసవిలోనే ఉంటుందని చాలామంది భావిస్తుంటారు. కానీ వర్థాకాలంలో కూడా ఈ సమస్య ఉత్పన్నమౌతుంటుంది. కారణం ఈ సమయంలో సహజంగానే నీళ్లు తక్కువగా తాగుతుంటారు. మరోవైపు ఈ సమయంలో తీవ్రమైన ఉక్కపోత వల్ల శరీరం డీహైడ్రేట్ అవుతుంటుంది. కొన్నిరకాల హెల్తీ డ్రింక్స్‌తో ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మజ్జిగ తాగడం మంచి ప్రత్యామ్నాయమని చాలామంది నిపుణులు చెబుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా మజ్జిగ తాగడం వల్ల ఆరోగ్యానికి కలికే ఇతర ప్రయోజనాలు తెలుసుకుందాం..
సాధారణంగా హ్యుమిడిటీ అంటే ఉక్కపోత వేసవితో సమానంగా వర్షాకాలంలో కూడా ఉంటుంది. వాతావరణంలో ఉక్కపోత పెరిగిప్పుడు నియమిత మోతాదులో మజ్జిగ తాగడం వల్ల శరీరానికి ఎదురయ్యే చాలా రకాల వ్యాధుల్నించి కాపాడుకోవచ్చు. మజ్జిగ క్రమం తప్పకుండా తాగడం వల్ల కడుపు నిండినట్టుంటుంది. ఎక్కువ ఆకలేయదు. అజీర్థి, కడుపులో మంట సమస్యలు దూరమౌతాయి. ఆహారం జీర్ణం కాకపోతే జీలకర్ర, నల్ల మిరియాలు పౌడర్‌లో కొద్దిగా పింక్ సాల్ట్ కలిపి తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మజ్జిగలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కే కావల్సిన పరిమాణంలో ఉంటాయి. మజ్జిగ క్రమం తప్పకుండా తాగితే శరీరానికి కావల్సిన నూట్రియంట్లు పుష్కలంగా లభిస్తాయి. మజ్జిగ శరీరానికి కావల్సిన ఎలక్ట్రోలైట్స్, ఫ్లూయిడ్స్ లెవెల్‌ను బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే డీహైడ్రేషన్ సమస్య తలెత్తదు. వివిధ సందర్భాల్లో మసాలాలతో కూడిన ఆహారం తీనడం వల్ల శరీరంలో మంట లేదా స్వెల్లింగ్ సమస్య ఏర్పడవచ్చు. ఈ పరిస్థితుల్లో మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ సులభమౌతుంది. గ్యాస్ వంటి సమస్యలు తలెత్తవు.
మజ్జిగలో కావల్సినంతగా కాల్షియం ఉండటం వల్ల ఎముకలు పటిష్టంగా మారతాయి. రోజూ నియమితంగా తాగడం వల్ల ఆస్టియోపోరోసిస్ వ్యాధి నుంచి కాపాడుకోవచ్చు. మజ్జిగ తాగడం వల్ల సరీరంలో నీటి కొరత ఏర్పడదు. సాధారణంగా ఈ సమయంలో చెమట ఎక్కువగా పడుతుంటుంది. ఫలితంగా డీ హైడ్రేషన్ సమస్య రావచ్చు. అందుకే క్రమం తప్పకుండా మజ్జిగ తాగితే శరీరం హైడ్రేట్ అవుతుంది.
మజ్జిగ రోజూ తాగడం వల్ల బరువు పెరగకుండా నియంత్రించవచ్చు. ఎందుకంటే బరువు నియంత్రణలో మజ్జిగ అద్భుతంగా ఉపయోగపడుతుందని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. మజ్జిగలో కేలరీలు, ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. ఫ్యాట్ బర్న్ చేసేందుకు దోహదపడుతుంది. మజ్జిగ క్రమం తప్పకుండా తాగుతుంటే..ఎసిడిటీ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది. భోజనం చేసిన కాస్సేపటి తరువాత మజ్జిగ తాగడం మంచి అలవాటు. కడుపు సంబంధిత సమస్యలు చాలావరకూ దూరమౌతాయి.
మజ్జిగ రోజూ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రోబయోటిక్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. శరీరంలో ప్రేవుల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. శరీరం ఇమ్యూనిటీని అద్భుతంగా పెంచడంలో మజ్జిగ చాలా బాగా ఉపయోగపడుతుంది.
Also read: Cumin Seeds Benefits: ఈ నీళ్లు రోజూ పరగడుపున తాగితే చాలు..స్థూలకాయం సహా చాలా సమస్యలు దూరం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook