How To save stroke effected person: భానుడు భగభగ మండుతున్నాడు. నిన్న కేవలం ఒక్క రోజులోనే 19 మంది వరకు మృత్యువాత పడ్డారు. వీరంతా వడదెబ్బ కారణంగా చనిపోయారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో అసువులు బాస్తున్నారు. అయితే, ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. అవేంటో తెలుసుకుందాం.ఈ ఎండలకు మధ్యాహ్నం సమయంలో అస్సలు బయటకు రాకండి. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లేటప్పుడు పాదరక్షలు ధరించాలి. కేవలం కాటన్ దుస్తులను మాత్రమే ధరించాలి. సన్ గ్లాసెస్ పెట్టుకోవాలి. వదులైన దుస్తులను మాత్రమే ధరించాలి. ముఖానికి సన్‌స్క్రీన్ కూడా పెట్టుకోవాలి. spf ఉన్న సన్‌స్క్రీన్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వండి.
వడడెబ్బ తగిలిన వ్యక్తికి ఇలాచేయండి..
ఒకవవేళ వడదెబ్బ తగిలితే ఆ వ్యక్తికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఉల్లిపాయను మెత్తగా నూరి వడదెబ్బ తగిలిన వ్యక్తికి శరీరానికి పై పూతగా రాయాలి. ఒక గ్లాసు నిమ్మరసం కలిపి ఉప్పు, పంచదార కలిపి ఆ వ్యక్తికి ఇవ్వాలి. వేసవిలో బయట నుంచి ఇంటికి తిరిగి రాగానే స్నానం చేయాలి. నిద్రపోవడానికి ముందు చర్మాన్ని శుభ్ర పరుచుకొని పౌడర్ రాసుకోవాలి. వేసవిలో వారానికి ఒక సారైనా కూలింగ్ ఫేస్ ప్యాక్ వేయించుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా మజ్జిగ తాగడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ఇది శరీర ఉష్ణోగ్రతలను తగ్గించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
ఇదీ చదవండి: బయటకు రాకండి బాబోయ్.. కేవలం ఒక్కరోజులోనే వడదెబ్బకు 19 మంచి మృత్యువాత..!
ఈ వేసవిలో మన ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధవహించాలి. ముఖ్యంగా కీర దోస ముక్కలు తినడం వల్ల ఇందులో ఉండే పోషకాలు డీహైడ్రేషన్ ను ధరిచేరనివ్వదు. మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. శరీరంలో నీరు తగ్గడం వల్ల వడదెబ్బ తగులుతుంది. దీనిని నివారించాలంటే నీటిశాతం ఎక్కువగా ఉండే పుచ్చకాయలు కొబ్బరినీళ్లు మంచినీళ్లు తరచూ తాగుతూ ఉండాలి ఈ కాలంలో తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఇదీ చదవండి: ఈ 5 ఫుడ్స్ కాలేయంలో పేరుకున్న విషపూరిత పదార్థాలను బయటకు తరిమేస్తాయి..
పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూడండి..
ఐదేళ్లలోపు చిన్నారులను, 65 పైబడిన వారు, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లమ్, స్థూలకాయం, ప్రెగ్నెన్సీ, స్మోకింగ్, ఆల్కహాల్ చేసే వారిలో సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీవ్రంగా తల నొప్పి ఉండటం, జ్వరం వాంతులు, విరోచనాలు తల తిరిగినట్లు ఉండడం, హార్ట్ రేట్ పెరగడం, మూత్రం పచ్చగా రావడం ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook