How To Lower Cholesterol: ప్రస్తుతం చాలా మందిలో చెడు కొలెస్ట్రాల్ సమస్యలు వస్తున్నాయి. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు సకాలంలో ఉపశమనం పొందడం చాలా మంచిది. లేకపోతే తీవ్ర గుండె సమస్యలతో పాటు, మధుమేహం, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
కొలెస్ట్రాల్ సమస్యలున్నవారు ఈ ఆహారాలు తీసుకోవాలి:
చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు అనారోగ్యకరమైన ఆహారాలు తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం ప్రతి రోజు ధాన్యాలు, పండ్లు, కూరగాయలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే పోషకాలు తీవ్ర అనారోగ్య సమస్యల ఉపశమనం కలిగిస్తాయి.
అంజీర్ పండ్లు:
ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అంజీర్ పండ్లు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి అంజీర్ పండ్లను నీటిలో నానబెట్టి ప్రతి రోజు తీసుకోవాల్సి ఉంటుంది.
ఫైబర్, ప్రోటీన్ల అధికంగా తీసుకోవాలి:
ప్రతి రోజు ఫైబర్, ప్రోటీన్ల అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తీవ్ర కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు బ్రోకలీ, సోయా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
అర్గాన్ ఆయిల్:
మార్కెట్‌లో ప్రస్తుతం అనారోగ్యకరమైన ఆయిల్స్ లభిస్తున్నాయి. వీటిని వినియోగించడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. అయితే చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అర్గానిక్ ఆయిల్‌ను వినియోగించాల్సి ఉంటుంది.
ఆయుర్వేద ఔషధాలను వినియోగించాలి:
శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలను నియంత్రించుకోవడానికి ప్రతి రోజు ఆయుర్వేద మందులను వినియోగించాల్సి ఉంచాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook