PCOD Treatment: పీసీఓడీ..మహిళల్లో వేధించే సమస్య. పోలీసిస్టిక్ ఓవరీ డిసార్డర్. ఈ సమస్యకు ఆయుర్వేదంలో చికిత్స ఉందా..ఏ పరిస్థితుల్లో పీసీఓడీకు చికిత్స సాధ్యంకాదు..కారణాలేంటి..పూర్తి వివరాలు మీ కోసం..
పురుషులతో పోలిస్తే మహిళలకే అనారోగ్య సమస్యలు అధికం. దీనికితోడు శారీరంగా మహిళలకు అదనంగా కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అందులో ప్రధానమైంది పీసీఓడీ. అంటే పోలీసిస్టిక్ ఓవరీ డిసార్డర్ లేదా సిండ్రోమ్. ఇటీవలికాలంలో చాలా ఎక్కువగా కన్పిస్తోంది. ఆయుర్వేదంలో పీసీఓడీ సమస్యకు చికిత్స ఎంతవరకూ ఉందో తెలుసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం పీసీఓడీ కేసుల సంఖ్య పెరగడానికి కారణం ఆధునిక జీవనశైలి మాత్రమే. ఆధునిక జీవనశైలిలో ఎదుర్కొనే ఒత్తిడి, అన్బ్యాలెన్స్డ్ భోజనం, చెడు అలవాట్లు కారణంగా హార్మోన్లలో సమతుల్యత పోతుంది. ఫలితంగా పీసీఓడీ సమస్య ఏర్పడుతుంది. పంచకర్మలోని ఆయుర్వేద విధానంతో మొత్తం శరీరాన్ని శుభ్రం చేయవచ్చు.
ఏ పరిస్థితుల్లో పీసీఓడీకు చికిత్స సాధ్యం కాదు, కారణాలేంటి
పీసీఓడీ లేదా పీసీఓఎస్ అనేది హార్మోన్ కారక సమస్య. హార్మోన్ బ్యాలెన్స్ తప్పినప్పుుడు మహిళల్లో ఈ సమస్య తలెత్తుతుంది. ఇది సాధారణంగా పురుష హార్మోన్ టెస్టోస్టిరోన్ వృద్ధి చెందడం వల్ల కన్పిస్తుంది. అయితే కొన్ని కేసుల్లో కారణమనేది నిర్ధారించలేం. అది కనుగొనడం దాదాపుగా అసాధ్యం. ఈ పరిస్థితుల్లో చికిత్స అనేది సాధ్యం కాదు. మిగిలిన అన్ని సందర్భాల్లోనూ పీసీఓడీకు చికిత్స అందించవచ్చు. నియంత్రించవచ్చు.
ఆయుర్వేదంలో పీసీఓడీకు చికిత్స ఎంతవరకూ సాధ్యం
ఆయుర్వేద వైద్యశాస్త్రంలో దాదాపు 85 శాతం రోగులకు పీసీఓడీ సమస్యను పరిష్కరించవచ్చు. మనిషి శరీర ఆకృతి, పీసీఓడీ కారణాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే దీర్ఘకాలిక చికిత్సతో ఎక్కువ ప్రయోజనాలుంటాయి. కనీసం మూడు నెలలు పట్టవచ్చని తెలుస్తోంది.
Also read: Tomato Flu: ఇండియాలో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ, కేరళ, ఒడిశాలో కేసులు, లక్షణాలెలా ఉంటాయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook