Tomato Flu: ఇండియాలో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ, కేరళ, ఒడిశాలో కేసులు, లక్షణాలెలా ఉంటాయి

Tomato Flu: దేశం ఇప్పుడు మరో ఫ్లూ ఎదుర్కొంటోంది. కొత్తగా టొమాటో ఫ్లూ ఇండియాలో ప్రమాద సంకేతాలిస్తోంది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 20, 2022, 09:06 PM IST
Tomato Flu: ఇండియాలో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ, కేరళ, ఒడిశాలో కేసులు, లక్షణాలెలా ఉంటాయి

Tomato Flu: దేశం ఇప్పుడు మరో ఫ్లూ ఎదుర్కొంటోంది. కొత్తగా టొమాటో ఫ్లూ ఇండియాలో ప్రమాద సంకేతాలిస్తోంది. చిన్నారుల్లో ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని లాన్సెట్ జర్నల్ హెచ్చరించింది. 

ఇండియాలో కొత్త ఫ్లూ వ్యాపిస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టొమాటో ఫ్లూగా పిలిచే ఈ వ్యాధిలో చేతులు, కాళ్లు , నోటికి సంబంధించిన వ్యాధి ఇది. ఇప్పటికే దేశంలో కేరళ, ఒడిశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పించాయి. ఇండియాలో తొలిసారిగా మే 6వ తేదీన కేరళలోని కొల్లామ్‌లో ఈ వ్యాధి కనుగొన్నారని..ఇప్పటివరకూ 82 మంది చిన్నారులకు వ్యాధి సోకినట్టు ప్రముఖ అంతర్జాతీయ హెల్త్ మేగజైన్ లాన్సెట్ రెస్పిరేటరీ జర్నల్ హెచ్చరించింది. ఈ చిన్నారులంతా 5 ఏళ్లలోపువారు కావడం విశేషం.

టొమాటో ఫ్లూ ఎలా ఉంటుంది

ఇప్పటికే కరోనా ఫోర్త్‌వేవ్ ఆందోళనను ఎదుర్కొంటున్న నేపధ్యంలో కొత్త వైరస్ టొమాటో ఫ్లూ లేదా టొమాటో ఫీవర్ మరింత ఆందోళన కల్గిస్తోంది. ఈ వ్యాధి ఇంటెస్టైనల్ వైరస్ కారణంగా వస్తుంది. పెద్దవారిలో చాలా అరుదుగా కన్పిస్తుంది. అది కూడా రోగ నిరోధక శక్తి మరీ తక్కువగా ఉన్నవారిలో వస్తుంది. ఈ వ్యాధి సోకితే కాళ్లు, చేతులు, నోటిపై ఎర్రగా, నొప్పితో కూడిన నీటి పొక్కుల్లా ఏర్పడతాయి. ఇవి క్రమంగా టొమాటో సైజులో పెరుగుతాయి. అందుకే వీటిని టొమాటో ఫ్లూ అని పిలుస్తున్నారు. 

టొమాటో ఫ్లూ లక్షణాలు

తీవ్రమైన జ్వరం, ఒళ్లు నొప్పులు, జాయింట్ పెయిన్స్, అలసట, నీరసం. కొద్దిగా చికెన్ గున్యా లక్షణాలు కన్పిస్తాయి. కొంతమంది రోగుల్లో నాసియా, వాంతులు, డయేరియా, జ్వరం, డీ హైడ్రేషన్, జాయింట్లలో నొప్పి, ఒళ్లు నొప్పులుంటాయి. 

కేరళలోని ఆంచల్, అర్యన్‌కవు, నెడవత్తూర్ ప్రాంతాల్లో ఈ వ్యాధి లక్షణాలు కన్పించాయని లాన్సెట్ జర్నల్ వెల్లడించింది. కేరళలో ఈ వ్యాధి లక్షణాలు కన్పించడంతో పొరుగు రాష్ట్రాలైనా తమిళనాడు, కర్నాటకలు ఆందోళన చెందుతున్నాయి. అటు ఒడిశాలో 1-9 ఏళ్లలోపు చిన్నారులు 26మందికి ఈ వ్యాధి సోకింది. తమిళనాడులో కూడా కొన్ని కేసులు వెలుగుచూశాయి. మొత్తానికి కేరళ, ఒడిశా, తమిళనాడు తప్ప,..దేశంలోని వేరే ప్రాంతాల్లో టొమాటో ఫ్లూ లక్షణాలు కన్పించలేదు. 

టొమాటో ఫ్లూతో ఆరోగ్యం క్షీణిస్తుందని..చికిత్సకై ఇంకా నిర్దిష్టమైన మందు లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది వేగంగా సంక్రమించే వ్యాధి అని హెచ్చరించారు. 

Also read: Rajiv Gandhi Birth Anniversary: రాజీవ్ గాంధీ జయంతి.. ఇవాళే సద్భావన దివాస్ ఎందుకు ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News