Stomach Cancer Symptoms In Telugu: ప్రస్తుతం చాలామందిలో అనేక రకాల పొట్ట సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా ఆధునిక జీవనశైలి పాటించే వారిలో పొట్ట సంబంధిత క్యాన్సర్ కూడా వస్తుంది దీనిని వైద్య పరిభాషలో గ్యాస్టిక్ క్యాన్సర్ కూడా అంటారు. ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ఈ క్యాన్సర్ సంబంధిత కేసుల సంఖ్య ప్రతి సంవత్సరానికి విపరీతంగా పెరిగిపోతోంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య సుమారు 60,000 పైగానే ఉంటుందని అధ్యయనాల్లో పేర్కొన్నారు. ఈ పొట్ట క్యాన్సర్ కారణంగా సంవత్సరానికి సుమారు 50,000 మరణాలు నమోదవుతున్నాయి. అయితే ఈ క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం చాలామందిలో పొట్ట కణాల్లోని DNAలో జన్యు మార్పులు వస్తున్నాయి. చాలామందిలో దీని కారణంగా కూడా పొట్ట క్యాన్సర్ వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొంతమందిలోనైతే పొట్టలో మంట అల్సర్, కడుపులో పుండ్లు రావడం వంటి కారణంగా కూడా ఈ క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉన్నవారు ముందుగానే గమనించి పలు రకాల జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరికొంతమందిలోనైతే..మితిమీరిన ధూమపానం కూరగాయలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం పండ్లను ఎక్కువగా తినకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు అంటున్నారు.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
పొట్ట క్యాన్సర్ లక్షణాలు:
అకస్మాత్తుగా బరువు తగ్గడం
పొట్ట ఎగువ భాగంలో నొప్పి రావడం
ఆహారం తిన్న తర్వాత పదే పదే వాంతులు రావడం
రక్తంతో వాంతులు రావడం
నలుపు రంగు తో కూడిన మలం రావడం
ఈ వ్యక్తులే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది:
పొట్ట క్యాన్సర్ బారిన పడటానికి స్త్రీల కంటే పురుషులే అధికం.
పండ్లు కూరగాయలు తక్కువ తీసుకునే వారిలో పొట్ట సంబంధిత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి
అధిక బరువు ఉన్నప్పటికీ కూడా ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
అతిగా ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల కూడా రావచ్చు.
సోడియం ఎక్కువ ఉన్న ఆహారాలకు కారణంగా కూడా పొట్ట క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
Also Read Hacking Accounts: తెలంగాణపై హ్యాకర్ల ముప్పేట దాడి.. గవర్నర్, మంత్రి, కవిత ఖాతాలను వదలని హ్యాకర్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter