White Brinjal Benefits: వంకాయ అంటే కొంతమంది లొట్టలు వేసుకొని మరీ తింటూ ఉంటారు. ఎందుకంటే వంకాయలో ఉండే గుణాలు నోటికి మధురమైన రుచిని అందిస్తాయి. అయితే చాలామంది వీటిని తినకూడదని సాకులు చెబుతూ ఉంటారు. అయితే క్రమం తప్పకుండా వంకాయలను తినడం మంచిదేనా? క్రమం తప్పకుండా వంకాయలను తినడం వల్ల శరీరానికి అనేక రకాల లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే పోషక గుణాలు అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.
ఆకుపచ్చని రంగులో ఉన్న వంకాయల కంటే తెలుపు రంగులో ఉన్న వంకాయలను తినడం వల్ల శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే పోషక గుణాలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతాయి. దీంతోపాటు శరీరానికి పోషకాలను అందిస్తాయి.
మధుమేహం ఉన్నవారు తినొచ్చా?
తెలుపు రంగు కలిగిన వంకాయలను ప్రతిరోజు తినడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారు ఈ వంకాయలను ప్రతిరోజు తినడం వల్ల రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా వంకాయలో ఉండే గుణాలు మధుమేహం ఉన్నవారిని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. తెలుపు రంగుతో కూడిన వంకాయలలో ఫైబర్, మెగ్నీషియం అధిక పరిమాణంలో లభిస్తాయి.. కాబట్టి మధుమేహం ఉన్నవారికి దీర్ఘకాలిక వ్యాధులు ఉపశమనం లభిస్తుంది.
శరీర బరువును కూడా నియంత్రిస్తుంది:
తెలుపు రంగుతో కూడిన వంకాయలను ఊబకాయంతో బాధపడేవారు ప్రతిరోజు తినడం వల్ల సులభంగా శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే పీచు పదార్థాలు ఆకలిని నియంత్రించేందుకు కూడా సహాయ పడతాయి. కాబట్టి పదే పదే ఆకలిగా అనిపించేవారు డైట్ లో తప్పకుండా తెలుపు రంగు తో వంకాయలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే సులభంగా బరువు తగ్గుతారు.
కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల చాలా మంది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిని పడుతున్నారు. అయితే చాలామందిలో దీని కారణంగా గుండె పోటు సమస్యలు కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి.. క్రమం తప్పకుండా డైట్ లో తెలుపు రంగు వంకాయలను తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణ లో ఉంటుంది.
కిడ్నీ సమస్యలను కూడా దూరం చేస్తుంది:
ప్రస్తుతం చాలామంది చిన్న వయసులోనే కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటున్నారు. ఇలాంటి వారి కోసం తెలుపు రంగు వంకాయ ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ వంకాయలో ఉండే గుణాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా చేసేందుకు సహాయపడతాయి. అంతేకాకుండా ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి