World Stroke Day 2022: గుండె శరీరానికి ప్రధాన అవయవం. దీని వల్లే మానవుడు జీవించగలుగుతాడు. ప్రతి సంవత్సరం గుండె పోటు నివారణ, చికిత్స దినోత్సవాన్ని జరుపుకుంటారు. గుండె పోటు గురించి అవగహన కల్పించేందుకే ఈ గుండె పోటు దినోత్సవాన్ని అక్టోబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. అయితే ఈ స్ట్రోక్ రావడానికి ప్రధాన కారణాలు మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుండె పోటు బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని.. స్ట్రోక్‌ను నిరోధించడానికి ప్రతి సంవత్సరం స్ట్రోక్ డేని జరుపుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.
అయితే ప్రతి సంవత్సరం ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం థీమ్ విడుదల చేస్తారు. అయితే ఈ సంవత్సరం "గుండెపోటు లక్షణాల సమాచారాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలపండి " అనే థీమ్ విడుదల చేశారు. దీని ఈ థీమ్ ప్రధాన లక్షం గుండె పోటు లక్షణాలు ముందుగానే తెలుసుకుంటే సులభంగా గుండె పోటు నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికే పలు దేశాల్లో గుండె పోటు సంబంధించిన లక్షణాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
స్ట్రోక్ డేని ఎలా జరుపుకుంటారు:
స్ట్రోక్ డే రోజున ప్రజలు పోస్టర్లను తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తద్వారా గుండె పోటుకు లక్షణాలకు సంబంధించిన సమాచారం ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తోంది. కాబట్టి మీరు కూడా ఈ లక్షణాలను ప్రపంచ వ్యాప్తంగా తెలయజేయడానికి సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి.
ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది:
1) రక్తపోటుతో పాటు రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుంది. 40 ఏళ్లు పైబడి ఉన్న వారు రెగ్యులర్‌గా బీపీ, షుగర్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళా వీటి పరిమాణలు ఎక్కువగా ఉంటే నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇలా చేయడం వల్ల మీరు గుండె పోటు నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
2) ధూమపానం మానకోండి.
3) అతిగా ఆల్కహాల్ తీసుకోవడం మానుకోండి. తీసుకోవాలనుకునేవారు కేవలం రెడ్ వైన్‌ను మాత్రమే తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
4) బరువు పెరిగితే తప్పకుండా నియంత్రించుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. కాబట్టి 30 నిమిషాల పాటు వ్యాయామాలు చేయడం మంచిది.
5) ఇప్పటివరికే స్ట్రోక్ వచ్చిన వారు న్యూరాలజిస్ట్‌ని సంప్రదించడం చాలా మంచిది.
ఈ ఆహారాలకు దూరంగా ఉండండి:
1) సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్ ఉన్న ఆహారాలకు దూరంగా ఉండండి.
2) అధిక సోడియం గత ఆహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
3) ఊబకాయం వంటి సమస్యలకు దారి తీసే బర్గర్‌లు, చీజ్, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండడి.
4)కూరగాయలతో కూడిన ఆహారం స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
5) జంక్ ఫుడ్స్‌ను అస్సలు తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read : Chiranjeevi-Garikapati : మళ్లీ వివాదం షురూ.. గరికపాటి మీద చిరంజీవి పరోక్ష సెటైర్లు.. వీడియో వైరల్
Also Read : Jagadish Reddy: మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ ఝలక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి