New Year Celebrations 2025 Drunken Drive Tests: ఇంగ్లీష్ కొత్త యేడాది సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా పబ్ లు, క్లబ్బులు ఎక్కువ ఉండే చోట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. ఇప్పటి వరకు సిటీ వ్యాప్తంగా 1184 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు పోలీసులు. కొత్త యేడాది సందర్భంగా తాగి తందనాలు ఆడితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వం కూడా తాగుబోతులను ఎంకరేజ్ చేసేలా తమ ఖజానా నింపుకునేలా అర్ధరాత్రి వరకు పబ్ లు, బార్ లకు అనుమతులు ఇచ్చింది. కానీ తాగితే మాత్రం ఇంటికి వెళ్లడానికి క్యాబ్ లేదా ఆటో లేదా ఇతరులను ఆశ్రయించి సేఫ్ గా ఇంటికి వెళ్లమని చెబుతుంది.
కానీ కొంత మంది తాగి నడుపుతూ ఇతర ప్రాణాలతో పాటు తమ ప్రాణాలకు ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాగి బండ్లు తోలిని వాళ్ల తోలు తీసారు హైదరాబాద్ పోలీసులు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పలు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసారు పోలీసులు.
ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 డ్రంకన్ డ్రైవ్ కేసులు రికార్డ్ కాగా...సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటిన తర్వాత పలు ప్రాంతాల్లో తాత్కాలిక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు పోలీసులు. చాలా చోట్ల మందుబాబులు పోలీసులకు చుక్కలు చూపించారు. ఇలాంటి వారిపై పలు చోట్ల కేసులు నమోదు చేశారు. మరికొందరిని రిమాండ్ లోకి తీసుకున్నారు పోలీసులు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.